Retro New Version Netflix: ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేకపోయిన చిత్రం ‘రెట్రో'(Retro Movie). వరుస పరాజయాలను అందుకుంటూ ఉన్న సూర్య(Surya Sivakumar), తమిళ క్రేజీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) తో కలిసి చేసిన సినిమా కావడం, దానికి తోడు ఈ చిత్రం నుండి ఒక పాట భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి యూత్ ఆడియన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేయడంతో అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకున్నాయి. చివరికి సినిమా విడుదల అయ్యేసరికి ఆ అంచనాలను ఏ మాత్రం మ్యాచ్ చేయకపోవడంతో డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. కానీ రీసెంట్ గానే ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఈ చిత్రానికి మాత్రం ఆడియన్స్ నుండి ఊహించని రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ టాప్ లోనే ట్రెండ్ అవుతూ ముందుకు దూసుకుపోతుంది.
ఆడియన్స్ నుండి వస్తున్నా ఈ రెస్పాన్స్ ని గమనించిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్, ఎడిటింగ్ లో తీసివేయబడిన కంటెంట్ ని త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో అప్లోడ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడట. సుమారుగా 28 నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియో కంటెంట్ ఈ చిత్రాన్ని ఓటీటీ లో ఇంకా పెద్ద రేంజ్ కి తీసుకెళ్తుందని భావిస్తున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. సూపర్ హిట్ సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు అభిమానులను మళ్ళీ థియేటర్స్ కి రప్పించడానికి ఎడిటింగ్ లో తొలగించిన కొన్ని సన్నివేశాలను జత చేస్తూ ఉంటారు మేకర్స్. ఇది ఎన్నో ఏళ్ళ నుండి కొనసాగుతూ వస్తున్న ట్రెండ్. గత ఏడాది విడుదలైన ‘పుష్ప 2 ‘ చిత్రానికి కూడా ఇలా చేశారు. హిట్ సినిమాలకు అలా చేయడం సర్వసాధారణం, కానీ మొదటిసారి ఒక డిజాస్టర్ సినిమాకు ఇలా చేస్తుండడం విశేషం.
Also Read: Retro Collection: ‘రెట్రో’ 11 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..టార్గెట్ ని అందుకోవడం ఇక అసాధ్యమే!
సూర్య గత చిత్రం ‘కంగువా’ కి థియేటర్స్ లో ఎలాంటి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చిందో, ఓటీటీ ఆడియన్స్ నుండి కూడా అలాంటి డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ రెట్రో చిత్రానికి థియేటర్స్ లో డిజాస్టర్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఓటీటీ లో మాత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్ వచ్చింది. ఈ ఒక్క విషయం లో అభిమానులు కాస్త సంతృప్తి చెందారు. సూర్య ఎంచుకుంటున్న సబ్జక్ట్స్ పర్ఫెక్ట్ గానే ఉన్నాయి, కానీ ఎక్కడో ఎదో మిస్ అవుతుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సూర్య మన తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి తో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ‘ప్రేమలు’ హీరోయిన్ మమిత బైజు ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం తో కచ్చితంగా సూర్య భారీ కం బ్యాక్ ఇస్తాడని ట్రేడ్ సైతం నమ్ముతుంది. చూడాలి మరి ఎంత వరకు నిజం అనేది.