8 Vasanthalu Actress Background: టాలీవుడ్ లో తన సత్తా చాటేందుకు మన ముందుకు రాబోతున్న మరో చిన్న సినిమా ‘8 వసంతాలు'(8 Vasanthaalu). ఈ ఏడాది పెద్ద హీరోల సినిమాలు విడుదల లేకపోవడం తో చిన్న సినిమాలే రాజ్యం ఏలుతున్నాయి. థియేటర్స్ లో ఈ ఏడాది అత్యధిక శాతం బిజినెస్ చిన్న సినిమాల ద్వారానే జరిగింది. అందుకే ఒక చక్కటి ఆహ్లాదకరమైన ప్రేమ కథ చిత్రం గా తెరకెక్కిన ‘8 వసంతాలు’ పై ట్రేడ్ లో మంచి బజ్ ఉంది. ఈ నెల 20 వ తారీఖున విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ విశేషాలను ఒకసారి తెలుసుందాం. ఈ చిత్రం లో అనంతిక అనిల్ కుమార్(Ananthika Sanilkumar) హీరోయిన్ గా నటించింది. ఈమె ‘మ్యాడ్’ చిత్రం ద్వారా హీరోయిన్ గా మన తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరైంది.
అంతకు ముందు ఈమె రైడ్, రాజమండ్రి రోజ్ మిల్క్, లాల్ సలాం వంటి చిత్రాల్లో నటిచింది. ఈ సినిమాల ద్వారా ఆమెకు పెద్ద పేరు రాలేదు కానీ, ‘మ్యాడ్’ చిత్రం మాత్రం ఈమెని ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా నిలిపింది. ఈ చిత్రం తర్వాత ఆమె నుండి విడుదల అవుతున్న సినిమానే ఈ ‘8 వసంతాలు’. ఫణింద్ర నారిశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. గతంలో ఈయన మధురం, మను వంటి సున్నితమైన చిత్రాలను తెరకెక్కించి మంచి గుర్తింపుని పొందాడు. ఇదంతా పక్కన పెడితే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ అనంతిక చేసిన లైవ్ మార్షల్ ఆర్ట్స్ పెర్ఫార్మన్స్ ని చూసి ఈ అమ్మాయికి ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయారు. చూసేందుకు ఈ అమ్మాయి ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. కానీ ఈమె టాలెంట్ ని చూస్తే ఇంకా ఎక్కువ ముచ్చటేస్తుంది. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ వీడియో ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
Also Read: Gangavva : ‘బిగ్ బాస్ 8’ ఫేమ్ అవినాష్ కి రాఖీ కట్టిన ‘గంగవ్వ’.. వైరల్ అవుతున్న వీడియో!
అనంతిక వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే. చిన్నతనం లోనే కరాటీలో అత్యుత్తమ శిక్షణ తీసుకొని బ్లాక్ బెల్ట్ ని సంపాదించింది. హీరోయిన్స్ లో ఈ రేంజ్ స్కిల్ ఎవరికీ లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా ఈమె క్లాసికల్ డ్యాన్స్ లో కూడా ఎంతో నైపుణ్యం కలిగిన అమ్మాయి. నిన్న మార్షల్ ఆర్ట్స్ లైవ్ పెర్ఫార్మన్స్ తో పాటు క్లాసికల్ డ్యాన్స్ కూడా అద్భుతంగా వేసి అందరినీ మంత్రం ముగ్దులను చేసింది. అదే విధంగా మార్షల్ ఆర్ట్స్ లో అతి క్లిష్టమైన కళారిపాయట్టు లో కూడా నైపుణ్యం కలిగిన అమ్మాయి ఈమె. వీటితో పాటు ఈమెకు కత్తి సాము, చెండా వంటి కళలు కూడా వచ్చు. ప్రస్తుతం నటిగా కొనసాగుతున్న ఈమె లాయర్ స్టూడెంట్ కూడా. చూసేందుకు చాలా సాధారణంగా అనిపిస్తున్న ఈ అమ్మాయిలో ఎంత టాలెంట్ దాగుందో మీరే చూడండి.