Nagarjuna: రజినీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ కోల్పోయిన నాగార్జున.. అది ఏ సినిమా అంటే..?

Nagarjuna: రజినీకాంత్ ఎంటైర్ కెరియర్లో భాష, ముత్తు , అరుణాచలం, నరసింహ,చంద్రముఖి, శివాజీ, రోబో లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన స్థాయిని ప్రపంచ నలుమూలాల విస్తరింపజేయడంలో ఈ సినిమాలు చాలా వరకు సక్సెస్ ని సాధించాయి.

Written By: Gopi, Updated On : June 17, 2024 11:22 am

Nagarjuna lost the chance to act in Rajinikanth film

Follow us on

Nagarjuna: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు రజనీకాంత్… ఆయన చేసిన సినిమాలు సంచలనాలను సృష్టిస్తున్నాయి. ఇక ఆయన ఎంటైర్ కెరియర్లో భాష, ముత్తు , అరుణాచలం, నరసింహ,చంద్రముఖి, శివాజీ, రోబో లాంటి సినిమాలు ఆయనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా ఆయన స్థాయిని ప్రపంచ నలుమూలాల విస్తరింపజేయడంలో ఈ సినిమాలు చాలా వరకు సక్సెస్ ని సాధించాయి.

ఇక ఆయన ఎంటైర్ కెరియర్లో ఆయన ఎన్నో వైవిధ్యబరితమైన పాత్రలను పోషించాడు. ఇక మణిరత్నం దర్శకత్వంలో ఆయన చేసిన ‘దళపతి ‘ సినిమాలో అరవింద స్వామి చేసిన క్యారెక్టర్ కోసం మొదట వేరే నటుడిని అనుకున్నారట. అందులో భాగంగానే అక్కినేని నాగార్జునని ఈ సినిమాలో తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యం తో మణిరత్నం భావించాడట. కానీ ఆ పాత్ర చిన్నదిగా ఉండడం దానికి సరైన గుర్తింపు లేకపోవడంతో ఆయన ఆ సినిమాని రిజెక్ట్ చేసినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక నాగార్జున ఈ సినిమాలో నటించి ఉంటే రజనీకాంత్ తో పాటు నటించే అవకాశం అయితే ఉండేది అంటూ సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

Also Read: ఈ క్యూట్ పాప.. తెలుగులో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

ప్రస్తుతం నాగార్జున శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక దీంట్లో నాగార్జున క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పటివరకు రివిల్ చేయనప్పటికి ఆయన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందుకోసమే తన వందొవ సినిమాని సైతం పక్కనపెట్టి నాగార్జున ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

Also Read: Mammootty: విజయ్ సేతుపతి, ఫహాద్ ఫజిల్ కాదు..విలన్ పాత్రలో ఆ నటుడు చేసి ఉంటే కథ వేరేలా ఉండేది..?

ఇక మొత్తానికైతే రజనీకాంత్ తో నాగార్జున ఒక మంచి సినిమాలో చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక ఈ విషయంలో నాగార్జున ఇప్పటికి కూడా చాలా బాధపడుతూ ఉంటాడట. ఇక అందువల్లే ఎవరితో అయినా నటించే అవకాశం వస్తే ఆ సినిమాలో నటించదానికి ఆయన ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తుంటాడట. ఇక అందులో బాగుంగానే శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో కుబేర సినిమాకి కూడా అదే విధంగా కమిట్ అయినట్టుగా తెలుస్తుంది…