Mammootty: విజయ్ సేతుపతి, ఫహాద్ ఫజిల్ కాదు..విలన్ పాత్రలో ఆ నటుడు చేసి ఉంటే కథ వేరేలా ఉండేది..?

ఒకవేళ వాడుకొని ఉంటే మాత్రం విలనిజం అనే పదానికి కొత్త అర్థం చెప్పేవాడు అంటూ ఆయన మీద చాలా మంది ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

Written By: Gopi, Updated On : June 17, 2024 10:03 am

Mammootty

Follow us on

Mammootty: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన పాత్రను పోషించడంలో కొంతమంది నటులు మంచి పేరును సంపాదించుకున్నారు. ఇక అందులో విజయ సేతుపతి, ఫహాద్ ఫజిల్ లాంటి వారు ప్రథమ స్థానంలో ఉన్నారు. అయితే వీళ్ళ కంటే ముందే ఒక నటుడికి తన టాలెంట్ చూపించే అవకాశం అయితే వచ్చింది. అయితే తను ఆ అవకాశాన్ని వాడుకోలేదు.

కానీ ఒకవేళ వాడుకొని ఉంటే మాత్రం విలనిజం అనే పదానికి కొత్త అర్థం చెప్పేవాడు అంటూ ఆయన మీద చాలా మంది ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇంతకీ అతను ఎవరు అంటే మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా సినిమాలో అతను విలన్ గా నటించాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల ఆయన ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక మొత్తానికైతే ఆ క్యారెక్టర్ లో ముఖేష్ రుషి నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నిజానికి మమ్ముట్టి కనక ఆ పాత్ర చేసినట్లయితే సినిమాకి ఆయన పాత్ర హైలెట్ అవ్వడమే కాకుండా ఆయనకు కూడా నటుడిగా మంచి గుర్తింపు అయితే వచ్చేది.

ఇక తనలో ఈ యాంగిల్ కూడా ఉందని గుర్తుపెట్టుకునేవారు. ఇక ఇప్పటికి కూడా ఆయన ఎక్కడ తగ్గకుండా స్టార్ హీరోలతో సైతం పోటీపడి వైవిద్య భరితమైన కథాంశాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక మొత్తానికైతే మమ్ముట్టి వరుస సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక రీసెంట్ గా ‘టర్బో ‘ అనే సినిమాతో వచ్చి ప్రేక్షకులందరిని మెప్పించాడు.

ఆ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ అందుకున్న మమ్ముట్టి సంవత్సరానికి దాదాపు 5 నుంచి 6 సినిమాలు రిలీజ్ చేస్తూ మంచి విజయాలనైతే తన ఖాతాలో వేసుకుంటున్నాడు…ఇక వరుసగా సినిమాలు సక్సెస్ చేయడంలో కూడా మమ్ముట్టి కీలకపాత్ర వహిస్తున్నాడు. ఇక తన నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా సూపర్ సక్సెస్ గా నిలవడమే కాకుండా మిగతా వాళ్ళందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు…