https://oktelugu.com/

ఈ క్యూట్ పాప.. తెలుగులో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

చిన్నగా ఉన్నప్పుడే తన చక్కటి స్మైల్ తో ఆకట్టుకుంటుంది ఈ పాప. పెద్దయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇదే నవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈమెను ఎవరూ పట్టించుకోలేదు.

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2024 / 10:37 AM IST

    Kazal Child Hood Pic

    Follow us on

    ఈ మధ్య కొందరు సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. చేతిలో పెద్దగా సినిమాలు సోషల్ మీడియా ద్వారా తమ పర్ఫామెన్స్ చూపిస్తున్నారు. కొందరు తమ తమ అందచందాల పిక్స్ ను షేర్ చేస్తుండగా..మరికొందరు తమ చిన్న నాటి ఫొటోలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. దీంతో వారి ఫ్యాన్స్ ఈ పిక్స్ తో సందడి చేస్తున్నారు. లేటేస్టుగా ఓ డైనమిక్ హీరోయిన్ తన చిన్న నాటి ఫొటోను నెటిజన్లతో పంచుకుంది. ఈ ఫొటోను చూసిన వారంతా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీలోనూ తనదైన ముద్ర వేసిన ఈ అందాల భామ ఎవరో తెలుసా?

    చిన్నగా ఉన్నప్పుడే తన చక్కటి స్మైల్ తో ఆకట్టుకుంటుంది ఈ పాప. పెద్దయ్యాక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇదే నవ్వుతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలుత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన ఈమెను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తరువాత ఆమె డేట్స్ కోసం క్యూ కట్టారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా తెలుగు హీరోలందరితో నటించిన ఈ హీరోయిన్ ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్తను పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతూ అలరిస్తోంది.

    ఆ పాప ఎవరో కాదు.. అందాల తార కాజల్. కాజల్ తెలుగులోకి ‘లక్ష్మీ కల్యాణం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘చందమామ’ సినిమాతో స్టార్ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సీనియర్ హీరోలందరితో నటించిన ఈమె ఖాతాలో ఎన్నో హిట్లు సినిమాలు వేసుకుంది. పెళ్లయిన తరువాత కూడా కాజల్ సినిమాల్లో కొనసాగడం విశేషం. అంతేకాకుండా ఇటీవల ఆమె హీరోయిన్ ఓరియెంటెడ్ ‘ఐపీఎస్ సత్యభామ’ సినిమాతో పోలీస్ పాత్రలో కనిపించింది. అలాగే కమలాసన్ తో ‘భారతీయుడు 2’లో కనిపించనుంది.

    అయితే కాజల్ కు సంబంధించిన చిన్న నాటి పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చిన్నప్పుడే ఎంతో క్యూట్ గా ఉన్న ఆమె పెరిగి పెద్దయ్యాక అంతే అందంతో అలరిస్తున్నారని అంటున్నారు. ఇక కాజల్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉంది. పెళ్లయిన తరువాత ఇలా సినిమాలో బిజీగా ఉన్నవారిలో కాజల్ మాత్రమే అని చెప్పొచ్చు.