Telesurgery: వైద్యరంగం కొత్త పుంతలు.. 40 కిలోమీటర్ల దూరం నుంచే ఆపరేషన్‌!

ఢిల్లీలో చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగికి 40 కి.మీ దూరంలో ఉన్న వైద్యులు టెలిసర్జరీ టెక్నిక్‌ ద్వారా ఆపరేషన్‌ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు.

Written By: Raj Shekar, Updated On : June 17, 2024 11:22 am

Telesurgery:

Follow us on

Telesurgery: వైద్యరగంలో ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే అనేక మార్పులతో మొండి వ్యాధులకు కూడా చికిత్స అందుబాటులోకి వచ్చింది. తాజాగా డాక్టర్‌ సమీపంలో లేకపోయినా.. ఆపరేషన్‌ నిర్వహించే టెక్నాలజీని అభివృద్ధి చేశారు. దీంతో గురుగ్రామ్‌కు చెందిన వైద్యులు మరో ఆద్భుతం చేసి ఆశ్చర్యపర్చారు.

40 కి.మీ దూరం నుంచి సర్జరీ..
ఢిల్లీలో చికిత్స పొందుతున్న క్యాన్సర్‌ రోగికి 40 కి.మీ దూరంలో ఉన్న వైద్యులు టెలిసర్జరీ టెక్నిక్‌ ద్వారా ఆపరేషన్‌ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. దాదాపు 45 నిమిషాలపాటు సాగిన ఈ ఆపరేషన్‌లో రోగికి కోత పెట్టడం నుంచి కణితి తొలగించడం, తిరిగి కుట్లు వేయడం వరకు మొత్త ప్రక్రియ పూర్తి చేశారు. డార్క్‌ గ్రాసెస్‌ ధరించి, రోబోట్‌ను ఆపరేట్‌ చేస్తూ వైద్యులు రోడి మూత్ర నాళం చుట్టూ ఉన్న క్యాన్సర్‌ ప్రభావిత కణాలను తొలగించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్యం నిలకడగా ఉంది. వారం రోజుల్లో బాధితుడిని ఆస్పత్రి నుంచి డిశ్చార్‌ చేసే అవకాశం ఉంది

ఎస్‌ఎన్‌ ఇన్నోవేషన్‌లో డాక్టర్లు..
వైద్యుల బృందం గురుగ్రామ్‌లోని ఎస్‌ఎన్‌ ఇన్నోవేషన్‌లో ఉండగా, 52 ఏళ్ల రోగి ఢిల్లీలోని రోహిణిలోని రాజీవ్‌గాంధీ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ అండ్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో చికిత్స అందుకున్నాడు. ఆపరేషన్‌ సమయంలో ఇంటర్నెట్‌తోపాటు సాంకేతికతకు అంతరాయం ఏర్పడకుండా వైద్య ప్రక్రియ పూర్తి చేశారు. క్యాన్సర్‌ ఇనిస్టిటయ్యూట్‌ మెడికల్‌ డైరెక్టర్, జెనిటో–యూరో ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సుధీర్‌ రాహుల్‌తోపాటు అతని వైద్య బృందం ఈ పరేషన్‌ నిర్వహించింది.

దేశంలో ఏమూలన ఉన్నా..
టెలిసర్జరీ ద్వారా ఏమూలన ఉన్న రోగులకైనా సర్జరీ నిర్వహించవచ్చని డాక్టర్‌ రావల్‌ తెలిపారు. ఆపరేషన్‌ సమయంలో తన రెండు చేతులు రోబోపై ఉంచానని, తాఉ ఆపరేషన్‌ థియేటర్‌లో ఉన్నట్లు భావిస్తూ పేషెంట్‌ ఎదురుగా పడుకుండగా మానిటర్‌లో రోగి శస్త్రచికిత్స భాగం ఎలా కనిపిస్తుందో, ఈ టెక్నిక్‌లో త్రీడీ నాణ్యతతో మరింత స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు. ఈ ఆపరేషన్‌ రోబోటిక్‌ సిస్టమ్‌ ద్వారా జరిగిదని వెల్లడించారు. దీనికి ఐదు సన్నని రోబోటిక్‌ చేతులు ఉన్నాయని చెప్పారు. దీనికి త్రీడీ హెచ్‌డీ సెట్‌ అనుసంధానమై ఉంటుందని, ఇది సర్జన్‌కు మరిత స్సష్టమైన దృశ్యం కనిపించేలా చేస్తుందని చెప్పారు. ఈ పద్ధతిలో రోగి చిన్నపాటి కోతకు గురవుతాడని తెలిపారు. రక్త ప్రసరణ కూడా తగ్గుతుందని వెల్లడించారు. ఈ పద్ధతిలో సర్జరీ చేస్తే సంప్రదాయ ఆపరేషన్‌ కంటే రోగి త్వరగా కోలుకుంటాడని వెల్లడించారు. ఇక ఈ ఆపరేషన్‌ను బెంగళూరుకు చెందిన 400 మంది వైద్యులు ప్రత్యక ప్రసారం ద్వారా వీక్షించినట్లు తెలిపారు.