Homeఅంతర్జాతీయంBike Viral Video: ఒకే బైక్ మీద పదిమంది.. పాకిస్తాన్ అంటే అలానే ఉంటుంది..

Bike Viral Video: ఒకే బైక్ మీద పదిమంది.. పాకిస్తాన్ అంటే అలానే ఉంటుంది..

Bike Viral Video: పాకిస్తాన్ గురించి వచ్చే వార్తలు చాలా వింతగా ఉంటాయి. ఆ దేశంలో జరిగే సంఘటనలు చాలా విచిత్రంగా ఉంటాయి. సోషల్ మీడియాలో పాకిస్తాన్ గురించి జరిగే చర్చ ఒక రేంజ్ లో ఉంటుంది. ప్రపంచంలో అన్ని దేశాల గురించి ఒక విధంగా జరుగుతూ ఉంటే.. పాకిస్తాన్ దేశానికి సంబంధించిన చర్చ మాత్రం సోషల్ మీడియాలో మరో విధంగా సాగుతూ ఉంటుంది. పాకిస్తాన్ దేశంలో జరిగే సంఘటనలు.. ప్రపంచానికి ప్రెస్ నుంచి విముక్తి కలిగిస్తాయి. ఒక ముక్కలో చెప్పాలంటే పాకిస్తాన్ అనేది ప్రపంచానికి స్ట్రెస్ బస్టర్ లాంటిది. అలాగని పాకిస్తాన్ గొప్ప దేశమని చెప్పడం లేదు. కామెడీ పీస్ అని చెప్పడం మా ఉద్దేశం.

పాకిస్తాన్ దేశంలో రోడ్లు సరిగా ఉండవు. రోడ్లు ధ్వంసం అయితే పట్టించుకునే వాడు ఉండడు. బాంబులు పేలి మనుషులు చనిపోతే వాళ్ల కర్మకు వాళ్ళు పోయారు అనుకుంటారే తప్ప.. ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయికి వచ్చి పరిస్థితిని ఏమాత్రం సమీక్షించరు. పైగా ప్రజల మీద పన్నులు వీర లెవల్లో వేసి వసూలు చేయడంలో పాకిస్తాన్ పాలకులు ఈస్ట్ ఇండియా కంపెనీని మించిపోతారు. ఆ స్థాయిలో పన్నులు వసూలు చేసినప్పటికీ పాకిస్తాన్లో అభివృద్ధి.. మనుషుల్లో మెరుగైన జీవనం అంజనం వేసి వెతికినా కనిపించదు.

పాకిస్తాన్ దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పెద్దగా ఉండవు. వాస్తవానికి అక్కడ రోడ్లు సక్రమంగా ఉంటే కదా. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్ వంటి ప్రాంతాలను మినహాయిస్తే మిగతా చోట్ల దారుణంగా ఉంటుంది పరిస్థితి. పాకిస్తాన్ దేశంలో ఒక్కో ద్విచక్ర వాహనం మీద ముగ్గురు లేదా నలుగురు.. కొన్ని సందర్భాల్లో అంతకుమించిన జనం కూర్చుంటారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్ దేశంలో ఒక వీధిలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బైక్ మీద పదిమంది ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది..

సాధారణంగా ఒక ద్విచక్ర వాహనం మీద ఇద్దరు ప్రయాణిస్తారు. కానీ ఆ బైక్ మీద ముగ్గురు మహిళలు.. వారి చేతులలో మరో ఆరుగురు పిల్లలు.. మొత్తం పది మంది కూర్చోవడంతో చూసేవాళ్ళు విస్తు పోయారు. పాకిస్తాన్లో ఇది కామన్ అయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో వెలుగులోకి రావడంతో..చూసే నెటిజన్ల కు దిమ్మ తిరిగిపోయింది. ఈ బండి నడుపుతున్న వ్యక్తి ఏకంగా ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉండటం విశేషం. ప్రాణాలు తెగించి వారు చేస్తున్న ఈ ప్రయాణం పై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు అంతమంది ఒకే బైక్ మీద ప్రయాణించకుంటే నష్టం ఏముందని వారు ప్రశ్నిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version