Nagarjuna House Intrusion: ప్రముఖ స్టార్ హీరో అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఇంటికి అర్థరాత్రి సమయం లో నలుగురు అభిమానులం అంటూ చొరబడ్డారు. అప్పుడు నాగార్జున సతీమణి అమల(Akkineni Amala) ‘మీరు అభిమానులు కాదు..క్రిమినల్స్’ అంటూ తిట్టి వాళ్ళను వెళ్లగొట్టేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో ఆమె ఇంట్లోకి చొరబడిన వ్యక్తితో మాట్లాడుతూ ‘మీరు అసలు ఫ్యాన్ నే కాదు. సినిమాలు ఫ్యాన్స్ కోసమే తీస్తారు. కానీ ఫ్యాన్ అని చెప్పుకుంటూ నెత్తిన కూర్చుంటే ఎలా?. ఇంట్లోకి చొరబడుతారా?, ఏ విధంగా మీరు అభిమానులు అవుతారు?, పోలీస్ కంప్లైంట్ ఇస్తే పెద్ద కేసు అవుతుంది ఇది’ అంటూ వారిస్తుంది అమల. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ప్రకంపనలు రేపుతోంది. అంత సెక్యూరిటీ ని దాటుకొని అంత పెద్ద స్టార్ హీరో ఇంట్లోకి వీళ్ళ ఎలా చొరబడ్డారో అంతు చిక్కడం లేదని సోషల్ మీడియా లో అభిమానులు అంటున్నారు.
Also Read: స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి..?అసలేం జరుగుతుంది…
అయితే అభిమానులు భయపడాల్సిన అవసరమే లేదు. నిజంగానే వాళ్ళు అక్కినేని కుటుంబానికి వీరాభిమానులు అట. ఎలా అయినా నాగార్జున ని కలవాలి అనే తాపత్రయం తో హద్దులు దాటి ఇలా ప్రయత్నం చేసారని అంటున్నారు విశ్లేషకులు. అలా ప్రవర్తించడం తప్పు, అభిమాని అనే వాడు ఇలా చేయడు, మీరు ఫ్యాన్స్ అనే పదానికి అర్థం తీసేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ఎంతో ప్రశాంతంగా కనిపించే అమల లో ఇంత ఫైర్ ఉందా అని ఈ వీడియో ని చూసిన అభిమానులు అంటున్నారు. అయితే ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి అంత దర్జాగా నాగార్జున ఇంట్లోకి ప్రవేశించాడంటే, సెక్యూరిటీ ఏ రేంజ్ లో నిద్ర పోతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడంటే అభిమాని వచ్చాడు, రేపో ఎవరో ఒకరు నాగార్జున అంటే ఇష్టం లేని వ్యక్తులు లోపలకు ప్రవేశించి దాడి చేస్తే పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
Also Read: మహేష్ బాబు చేసిన ఆ ఒక్క సినిమా ఆయన కెరియర్ ను 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిందా..?
సెలబ్రిటీలకు సెక్యూరిటీ ఇంత పేలవంతంగా ఉండడం ఇది రెండవసారి. నిన్న కూడా రాజమండ్రి లో హీరో రామ్ బస చేస్తున్న హోటల్ లోకి ప్రవేశించి, రామ్ గది వరకు వెళ్లి తలుపు బద్దలు కొట్టే ప్రయత్నం చేశారు. వీళ్ళు బాగా మద్యం సేవించినట్టు తెలిసింది. ఇలా ప్రముఖుల సెక్యూరిటీలు వైఫల్యం చెందుతుండడంతో అభిమానుల్లో కాస్త కంగారు మొదలైంది. ఇకపోతే నాగార్జున రీసెంట్ గానే ‘కుబేర’ చిత్రంతో భారీ కమర్షియల్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఆగష్టు నెలలో ఆయన విలన్ గా నటించిన ‘కూలీ’ చిత్రం విడుదల కాబోతుంది. ఇక సెప్టెంబర్ నెలలో ఎలాగో ఆయన బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా మన అందరికీ ప్రతీ వారం కనిపిస్తూనే ఉంటాడు. మొత్తానికి ఈ ఏడాది నాగ నామసంవత్సరం అంటూ అక్కినేని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
BIG BREAKING – అర్ధరాత్రి నాగార్జున ఇంట్లోకి చోరబడ్డ నలుగురు అక్కినేని అభిమానులు…మీరు అభిమానులు కాదు క్రిమినల్స్ అని వెళ్లగొట్టిన అక్కినేని అమల గారు…pic.twitter.com/anLbxwnk4C
— Tyson Naidu (@VintageTfiFan) July 2, 2025