Star Heros movie updates : ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో భారీ సక్సెస్ లను సాధించిన హీరోలు చాలా మంది ఉన్నారు…మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని శాసిస్తున్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక సెపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు…
సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎన్టీఆర్ స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి మంచి సబ్జెక్టులతో సినిమాలను చేస్తుండడం విశేషం… ఇక ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఒక సినిమాను అనౌన్స్ చేసిన డేట్ కి రిలీజ్ చేయడం లేదు. దానికి అసలు కారణం ఏంటి దర్శకుల దగ్గర లోపం జరుగుతుందా? లేదంటే హీరోల నుంచి సరైన ప్రోత్సాహం అందడం లేదా? ప్రొడ్యూసర్స్ డబ్బులు విషయంలో వెనుక ముందు ఆలోచిస్తున్నారా? అనుకున్న సమయంలో సినిమా షూట్ ను కంప్లీట్ చేయలేకపోతున్నారా. పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న విధంగా చేయలేకపోతున్నారా? అనేది ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటివరకు వచ్చిన స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లు పోస్ట్ పోన్ అవుతూ వచ్చినవే కావడం విశేషం… ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో రిలీజ్ డేట్ వరుసగా పోస్ట్ పోన్ అవుతున్నాయి. ప్రభాస్ నటించిన రాజాసాబ్ (Rajasaab) సినిమా రిలీజ్ డేట్లు వరుసగా రెండు సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు.
Also Read: ఆ ‘గేమ్ చేంజర్’ గోల ఇక వదిలేయండ్రా బాబు.. టార్చర్ చేయొద్దు – దిల్ రాజు
రామ్ చరణ్ గేమ్ చేంజర్ (Game Changer) సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఎన్టీఆర్ దేవర విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. అల్లు అర్జున్ పుష్ప 2 (Pushpa 2) సినిమా విషయంలో కూడా ఇలాగే జరిగింది. ప్రస్తుతం వస్తున్న స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వాటిని చక్కదిద్ది మన మేకర్స్ అనుకున్న డేట్ కి సినిమాను రిలీజ్ చేసే రోజు వస్తుందా రాదా? ఇలా రిలీజ్ డేట్ లు పోస్ట్ పోన్ చేస్తూ ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమా తాలూకు ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది. అలాగే ప్రొడ్యూసర్ తీసుకొచ్చి పెట్టిన డబ్బులకు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా పెరిగిపోతోంది. దానివల్ల ఆ సినిమాకి ఎక్కువగా వచ్చినప్పటికి అవి భారీ లాభాలుగా కనబడే అవకాశం అయితే లేదు.
మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి ఇండస్ట్రీలో చాలా తక్కువ సక్సెస్ రేట్ ఉన్న కారణంగా ప్రొడ్యూసర్స్ గాని, డైరెక్టర్స్ గాని హీరోలు గాని ఒక సినిమాని సరైన తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగితే చాలా మంచింది…