Kannappa Movie: మంచు విష్ణు(Manchu Vishnu) డ్రీం ప్రాజెక్ట్ ‘కన్నప్ప'(Kannappa Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై పాజిటివ్ టాక్ ని తెచ్చుకొని, పర్వాలేదు అనే రేంజ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇది మంచు విష్ణు రేంజ్ కి చాలా పెద్ద ఓపెనింగ్ అయినప్పటికీ, బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే అద్భుతమైన లాంగ్ రన్ ని సొంతం చేసుకోవాలని ట్రేడ్ విశ్లేషకులు మొదటి రోజే అభిప్రాయపడ్డారు. కానీ ఈ చిత్రం లాంగ్ రన్ లో చతికిల పడింది. మొదటి సోమవారం రోజునే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రాన్ని భారీ డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఇక 5 వ రోజు అయితే అనేక ప్రాంతాల్లో కనీసం థియేటర్స్ కి రెంట్స్ కూడా రీకవరీ అవ్వని పరిస్థితి ఏర్పడింది. ప్రభాస్(Rebel Star Prabhas), అక్షయ్ కుమార్(Akshay Kumar),మోహన్ లాల్(Mohanlal) వంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ కూడా ఈ చిత్రాన్ని కాపాడలేకపోయారంటే మంచు బ్రాండ్ ఎంత పవర్ ఫుల్ అనేది అర్థం చేసుకోవచ్చు.
Read Also: స్టార్ హీరోల సినిమాల రిలీజ్ ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం ఏంటి..?అసలేం జరుగుతుంది…
మొత్తం మీద ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 5 రోజులకు ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి వివరంగా, ప్రాంతాల వారీగా చూద్దాము. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 5వ రోజు 68 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి 5 రోజులకు కలిపి 14 కోట్ల 74 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ప్రాంతాల వారీగా చూస్తే నైజాం లో 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, సీడెడ్ లో రెండు కోట్ల 30 లక్షలు, ఉత్తరాంధ్ర లో 2 కోట్ల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో కోటి 10 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 80 లక్షలు, గుంటూరు జిల్లాలో 85 లక్షలు, కృష్ణ జిల్లాలో 78 లక్షలు, నెల్లూరు జిల్లాలో 73 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఇతర బాషల డబ్బింగ్ వసూళ్లను కలిపి 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, ఓవర్సీస్ లో రెండు కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 21 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే దాదాపుగా మరో 60 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. అది ఎలాగో అసాధ్యం కాబట్టి, మంచు కుటుంబానికి మరో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా ఈ చిత్రం మిగిలిపోయింది. చూస్తుంటే ఈ కుటుంబ సభ్యుల సినిమాలను ఆడియన్స్ పూర్తిగా రిజెక్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. సినిమా వ్యాపారం మానేసి వేరే ఏదైనా వ్యాప్తం చూసుకుంటే బెటర్ అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మంచు ఫ్యామిలీ పై సెటైర్లు వేస్తున్నారు.