Ninne Pelladatha: అక్కినేని నాగార్జున చాలా తెలివిగా “నిన్నే పెళ్లాడతా” 25 సంవత్సరాలు వేడుకను చేస్తున్నాడు. చైతు -సామ్ ఎపిసోడ్ ను ఎక్కువ కొన సాగనివ్వకుండా మీడియాకి మరో రకమైన స్టఫ్ ఇస్తూ మొత్తానికి ఆ విడాకుల టాపిక్ ను పక్కదారి పట్టించడానికి నాగ్ చాలా ప్లాన్డ్ గా ముందుకుపోతున్నాడు. నిజానికి చైతు విడాకుల ఎనౌన్స్ మెంట్ డేట్ ను కూడా నాగార్జునే ప్లాన్ చేశాడట.

లవ్ స్టోరీ రిలీజ్ కి ముందే చైతు విడాకుల పై క్లారిటీ ఇస్తాను అంటే.. సినిమాకి సమస్య వస్తోంది, రిలీజ్ తర్వాత స్పందించు అంటూ చైతుని డైరెక్ట్ చేశాడు నాగ్. ఇక ఈ విడాకుల వ్యవహారం పై మీడియా అనవసరమైన హడావుడి చేయకుండా.. వాళ్ళను డైవర్ట్ చేయడానికి “నిన్నే పెళ్లాడతా” అనే ఓల్డ్ సినిమా తాలుకు లేటెస్ట్ ప్రోగ్రాంను లైన్ లోకి తెచ్చాడు.
సరే.. ఇక ఈ “నిన్నే పెళ్లాడతా” సినిమా విషయానికి వస్తే.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. కాగా ఈ సినిమా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని ‘స్టార్ మా’ ఎన్నో విశేషాలతో సెలెబ్రేట్ చేస్తోంది. ఎవర్ గ్రీన్ ఫామిలీ ఎంటర్ టైనర్ అని, ప్రేమ కావ్యం అని ప్రతి ప్రేక్షకుడు ఆస్వాదించిన ఈ సినిమాలో ప్రేమ జంటగా నాగార్జున, టబు ల మాజికల్ మూమెంట్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.
కాగా ఈ సినిమాకి సంబంధించిన ఎన్నో విషయాలను నాగార్జున, ఈ సినిమా దర్శకుడు కృష్ణవంశీ, ఈ సినిమాలో తన అందచందాలతో మురిపించిన టబు ఆనాటి తీపి గుర్తుల్ని ఈ తరం ప్రేక్షకులకు చెప్పబోతున్నారు. అయితే, ఈ కార్యక్రమం ఈ రోజు స్టార్ మా లో మధ్యాహ్నం 3 గంటలకి మొదలు కానుంది. “నిన్నే పెళ్లాడతా”.. సెలబ్రేటింగ్ 25 ఇయర్స్ అఫ్ ఎమోషనల్ జర్నీలో ఎవరు ఏ సంగతులు చెబుతారో చూడాలి.