Manoj Bajpayee father: ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయి ఇంట్లో తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి అనారోగ్య కారణంగా ఈ రోజు మృతి చెందారు. గత కొన్ని రోజులుగా పెరిగిన వయసు రీత్యా ‘ఆర్కే బాజ్ పేయి’ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అయితే, నిన్న రాత్రి ఉన్నట్టు ఉండి ఆయన ఆరోగ్యం క్షీణించింది.

దాంతో వెంటనే తేరుకున్న ఆయన కుటుంబ సభ్యులు, హుటాహుటిన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. అయితే, డాక్టర్ల ట్రీట్మెంట్ కి మొదట్లో కోలుకుంటున్నట్లు కనిపించినప్పటికీ, ఆ తర్వాత ఆర్కే బాజ్‌పేయి ఆరోగ్యం బాగా దెబ్బ తింది. దాంతో ఆయన చికిత్స పొందుతూనే ఈ రోజు తుదిశ్వాస విడిచారు.
ఆర్కే బాజ్‌పేయి, బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించారు. తన కుమారుడు మనోజ్ ను నటుడిగా తీర్చిదిద్దటానికి ఢిల్లీకి మకాం మార్చాడు. మనోజ్ బాజ్‌పేయి ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరి నటుడిగా ఎదిగారు. ఆ తర్వాత సినిమా అవకాశాలు ఎక్కువ అవ్వడంతో ముంబైకి షిఫ్ట్ అయ్యారు. కానీ ఆర్కే బాజ్‌పేయి మాత్రం ఢిల్లీలోనే ఉండిపోయారు.
ఇక మనోజ్ బాజ్‌పేయి తండ్రి ఆర్కే బాజ్‌పేయి మృతి పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ఆర్కే బాజ్‌పేయి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.