Shah Rukh Khan Son Aryan Khan: సినిమా వాళ్లకు డ్రగ్స్ కు అవినాభావ సంబంధం ఉంది. రంగుల ప్రపంచంలో వెలుగుల మధ్య బతికే సినిమా పక్షులు సహజంగానే మత్తును బాగా ఇష్టపడతారు. అవసరం అయితే, ఆ మత్తులోనే బతకాలని ఆశ పడతారు. అయితే, మత్తు ముదిరి చిత్తు అయిపోయిన తారలు ఉన్నారు. స్టార్ల వారసులూ ఉన్నారు. అప్పట్లో ఎస్వీయార్ లాంటి మహానటుడు కుమారుడు దగ్గర నుంచి.. నేటి బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడి వరకు మత్తుకు బానిస అయినవారే.

అయితే, ఈ మధ్య డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేయడానికి తీవ్రంగా అలెర్ట్ అయింది పోలీస్ వ్యవస్థ. తాజాగా ముంబైలో భారీ డ్రగ్స్ రాకెట్ ను పట్టుకుంది. సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ లో ముగినితేలుతున్నారని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సమాచారం అందింది. అయితే,అధికారులు చాలా తెలివిగా శనివారం అర్ధరాత్రి డ్రగ్ రేవ్ పార్టీ జరుగుతున్న క్రూయిజ్ షిప్ పై దాడి చేశారు.
కానీ ఆ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు యువతీయువకులను చూసి పోలీసులు షాక్ అయ్యారు. వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా ఉన్నాడు. నిజానికి ఆ కుర్రాడు ఎప్పటి నుంచో మత్తులో బాగా ఆరితేరి పోయాడు అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. కానీ తండ్రి బలం ముందు పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు.
కాకపోతే, రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అవ్వడంతో ఇక చేసేది ఏమి లేక మొత్తానికి పోలీసులు ఆ సూపర్ స్టార్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. షారుక్ ఖాన్ కొడుకు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం అనే వార్త బాలీవుడ్ లో ఒక సంచలనం అయింది. కానీ, పోలీసులు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు ఉన్న లింకులపై ఎన్సీబీ అధికారులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తూ విచారణ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్యన్ ఫోన్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐతే, ఆర్యన్ కాల్స్ డేటాను, చాట్స్‌ను పరిశీలిస్తే.. కొంతమంది యంగ్ హీరోయిన్స్ కి కూడా డ్రగ్స్ కేసులో లింక్స్ ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పట్లో ఈ డ్రగ్స్ వ్యవహారం సినిమా వాళ్ళను వదిలిపెట్టేలా లేదు.