IPL 2025: కేవలం బ్యాటర్లు మాత్రమే కాదు.. బౌలర్లు కూడా అదరగొడుతున్నారు. బ్యాటర్ల ఏకచద్రాధిపత్యం సాగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. చాలా వరకు మ్యాచ్ లలో అయితే అద్భుతంగా బౌలింగ్ చేసి.. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను పడుకోబెడుతున్నారు. అద్భుతమైన బంతులు వేసి నేల నాకిస్తున్నారు.. ఈ సీజన్లో ఇప్పటివరకు సాగిన ఐపీఎల్ మ్యాచ్లలో నాలుగు సెంచరీలు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ నాలుగు కూడా భారతీయ బ్యాటర్లు చేసినవి కావడం విశేషం. ఆయా జట్లలో అరివీర భయంకరమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ.. కేవలం భారత్ నుంచి మాత్రమే బ్యాటర్లు సెంచరీలు చేయడం విశేషం.. ఇక ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటగాడు ఇషాన్ కిషన్(106) సెంచరీ చేశాడు. రాజస్థాన్ రాయల్స్ పై అతడు వీరవిహారం చేశాడు. తద్వారా తొలి శతకంబాడిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత చెన్నై జట్టుపై ప్రియాన్ష్ ఆర్య (103) సెంచరీ కొట్టాడు. పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ (141) సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. ఇక గుజరాత్ జట్టుపై వైభవ్ సూర్యవంశీ(101) అద్భుతమైన సెంచరీ చేసి అదరగొట్టాడు.
Also Read: జాక్ పాట్ కొట్టేసిన వైభవ్ సూర్యవంశీ!
ఇదే మ్యాజిక్కూ
అయితే ఈ సీజన్లో ఇప్పటివరకు 4 సెంచరీలు చేసిన ఆటగాళ్లు మొత్తం భారతదేశానికి చెందినవారు కావడం విశేషం. వీరంతా కూడా ఎడమ చేతి వాటం ఆటగాళ్లు కావడం మరింత విశేషం. అయితే ఇతర దేశాలకు చెందిన ఆటగాళ్లు సూపర్ ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. వారంతా 90 లలోపే పెవిలియన్ చేరుకున్నారు. ఆ పరుగులను వారు సెంచరీలుగా మార్చలేకపోయారు.. అయితే ఈ సీజన్లో రైట్ హ్యాండ్ బ్యాటర్లు సెంచరీలు చేయలేకపోవడం విశేషం. ఐపీఎల్ లో ఇప్పటివరకు రైట్ హ్యాండర్ బ్యాటర్లదే హవా కొనసాగింది. అయితే ఈ సీజన్ లో మాత్రం వారంతా సెంచరీల స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోతున్నారు. బలమైన ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ.. వాటిని మూడంకెల స్కోర్ లాగా మలచలేకపోతున్నారు. అయితే ఈ సీజన్ భారతీయ ఆటగాళ్లే అత్యధిక ధర పలికారు. నమోదైన నాలుగు సెంచరీలు కూడా వారే చేశారు. మొత్తంగా ఇప్పటివరకు ఈ సీజన్ లో అద్భుతమైన రికార్డును వారు నెలకొల్పారు. ఐపీఎల్ భారత దేశంలో జరుగుతోంది. ఇక్కడి మైదానాలు భారత ఆటగాళ్లకు కొట్టిన పిండి. అందువల్లే వారు భారీగా పరుగులు చేస్తున్నారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అయితే విదేశీ ఆటగాళ్లు సైతం భారీగానే పరుగులు తీస్తున్నప్పటికీ.. వారు వాటిని సెంచరీలుగా మలచ లేకపోతున్నారు. అందువల్లేవారు సెంచరీ హీరోలుగా నిలువ లేకపోతున్నారు. భారత ఆటగాళ్లు మాత్రమే తమకు సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడుతున్నారు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటున్నారు. అందువల్లే ఈ సీజన్లో సాగిన ఐపీఎల్ లో అదరగొట్టే రేంజ్ లో పరుగులు సాధించారు. తద్వారా అనితర సాధ్యమైన రికార్డులను సొంతం చేసుకున్నారు..