BYD: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో దూసుకుపోతున్న BYD కంపెనీ తన సీల్ 2025 ఎలక్ట్రిక్ కారు ధరలను అమాంతం పెంచింది. ఈ పెంపు ఏప్రిల్ 28, 2025 నుండి అమల్లోకి వచ్చింది. సీల్ కొన్ని వేరియంట్ల ధరలలో ఎలాంటి మార్పు లేదు. అప్ డేట్ చేసిన తర్వాత కొన్ని వేరియంట్లు ధరలు ఇప్పుడు మునుపటి వాటి కంటే రూ. 15,000 ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. శాతం పరంగా చూస్తే ఇది 0.33శాతం వరకు ఎక్కువ పెరుగుదలగా చెప్పవచ్చు. 2025 సీల్ వేరియంట్ల వారీగా పాత, కొత్త ధరలను ఈ వార్తలో తెలుసుకుందాం.
Also Read: ఐపీఎల్ లో నాలుగు సెంచరీలు..ఇందులో చాలా అద్భుతాలు, సంచలనాలు.. అవి ఏంటంటే?
BYD సీల్ 2025లో మూడు ప్రధాన వేరియంట్లలో లభిస్తుంది. వాటిలో మొదటిది ‘డైనమిక్’ వేరియంట్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనికి 7.0kW AC ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వేరియంట్ ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇది ఇప్పటికీ పాత ధర అయిన రూ. 41,00,000 కే లభిస్తుంది.
తర్వాత ‘ప్రీమియం’ వేరియంట్ వివరాల్లోకి వెళితే.. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 650 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. దీనికి కూడా 7.0kW AC ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే, ఈ వేరియంట్ ధర ఇప్పుడు రూ. 15,000 పెరిగింది. ఇంతకు ముందు దీని ధర రూ. 45,55,000 ఉండగా, ఇప్పుడు కొనుగోలుదారులు రూ. 45,70,000 చెల్లించాల్సి ఉంటుంది. ఇది 0.33శాతం ధర పెరిగింది.
చివరగా ‘పెర్ఫార్మెన్స్’ వేరియంట్. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 580 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. దీనికి కూడా 7.0kW AC ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ వేరియంట్ ధర కూడా రూ. 15,000 పెరిగింది. దీని పాత ధర రూ. 53,00,000 కాగా, ఇప్పుడు దీనిని రూ.53,15,000కు కొనుగోలు చేయవచ్చు. ఇది 0.28శాతం ధర పెరిగింది. కాబట్టి, BYD సీల్ 2025 ప్రీమియం లేదా పెర్ఫార్మెన్స్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలనుకున్నట్లు అయితే ఇప్పుడు అదనంగా రూ. 15,000 చెల్లించాలి. డైనమిక్ వేరియంట్‌ను ఎంచుకునే వారికి మాత్రం పాత ధరలోనే లభిస్తుంది.