Homeఎంటర్టైన్మెంట్సమంత రూట్ లోకి చైతు.. కారణం అదే !

సమంత రూట్ లోకి చైతు.. కారణం అదే !

అక్కినేని సమంతకు ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటించడం అలవాటు అయిపోయింది. సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో ఓటీటీల కోసం తెరకెక్కే కంటెంట్ పై కూడా అంతకంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కారణం ఒక్కటే, సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ ఓ రేంజ్ లో హిట్ అయింది. పైగా, సమంతకి నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఆ సిరీస్. ముఖ్యంగా ఆ వెబ్ సిరీస్ లో ఆమెది […]

Naga Chaitanya OTT debutఅక్కినేని సమంతకు ప్రస్తుతం వెబ్ సిరీస్ లో నటించడం అలవాటు అయిపోయింది. సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తోందో ఓటీటీల కోసం తెరకెక్కే కంటెంట్ పై కూడా అంతకంటే ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది. కారణం ఒక్కటే, సమంత నటించిన మొదటి వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మేన్ 2’ ఓ రేంజ్ లో హిట్ అయింది.

పైగా, సమంతకి నేషనల్ వైడ్ గా మంచి గుర్తింపును తీసుకొచ్చింది ఆ సిరీస్. ముఖ్యంగా ఆ వెబ్ సిరీస్ లో ఆమెది నెగెటివ్ పాత్ర కావడం, అందులోనూ కొన్ని షాట్స్ లో సామ్ వెరీ బోల్డ్ గా కనిపించి అలరించడంతో కుర్రాళ్ళు ఆ వెబ్ సిరీస్ పై ఎగబడ్డారు. మొత్తమ్మీద ఫ్యామిలీ మెన్ 2 సూపర్ హిట్ అయింది.

అయితే, సమంతకి దేశవ్యాప్తంగా వచ్చిన పేరును చూసిన చైతు కూడా వెబ్ సిరీస్ చెయ్యాలని తెగ ఉబలాటపడుతున్నాడట. తన సతీమణి రూట్ లోనే తానూ ఫాలో అవ్వాలని చైతు ఆరాటపడుతున్నాడు. అందుకే, నాగ చైతన్య హీరోగా నిర్మాత శరత్ మరార్ ఒక క్రేజీ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

మరి ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉందనేది కొన్ని రోజులు ఆగితే గాని, క్లారిటీ రాదు. నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల తీసిన ‘లవ్ స్టోరీ’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇక విక్రమ్ కుమార్ తీస్తున్న ‘థాంక్యూ’ షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేశాడు. వచ్చే నెలలో ‘బంగార్రాజు’ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేయనున్నాడు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper