Naga Chaitanya
Naga Chaitanya : వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో డీలాపడిన అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) ‘తండేల్’ చిత్రం(Thandel Movie) తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని అక్కినేని అభిమానులను ఖుషీ చేశాడు. పాటల పరంగా, నాగ చైతన్య నటన పరంగా ఈ సినిమాకు చూసినన్ని పాజిటివ్ ఫీడ్ బ్యాక్స్ నాగచైతన్య కెరీర్ లో ఏ సినిమాకు కూడా రాలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సుమారుగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలం సృష్టించిన ఈ సినిమా తర్వాత నాగ చైతన్య ఇదే సక్సెస్ స్ట్రీక్ ని కొనసాగిస్తాడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అయితే ఇంతకు ముందు లాగా మొహమాటానికి సినిమాలు ఒప్పుకొని చేయకుండా, కేవలం అభిమానులను దృష్టిలో పెట్టుకొనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు నాగ చైతన్య. అందులో భాగంగానే ఆయన విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) తో ఒక హారర్ థ్రిల్లర్ ని చేస్తున్నాడు.
Also Reda : ఆ సలహాల కోసం సమంత కి ఫోన్ కాల్ చేస్తుంటా అంటూ నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!
ఇప్పటి వరకు కేవలం యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ తో ప్రేక్షకులను, అభిమానులను అలరించిన నాగ చైతన్య మొట్టమొదటిసారి ఒక హారర్ జానర్ లో సినిమా చేయబోతున్నాడు. వాస్తవానికి ఆయన అమెజాన్ ప్రైమ్ వీడియో లో ‘దూత’ అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేశాడు. ఈ సిరీస్ పెద్ద హిట్ అయ్యింది. అదే మొదటి హారర్ జానర్ ఆయన కెరీర్ లో అని అనొచ్చు కానీ, అది వెబ్ సిరీస్ క్యాటగిరీలోకి వస్తుంది కాబట్టి పరిగణలోకి తీసుకోలేదు. అయితే విరూపాక్ష చిత్రంతో కార్తీక్ థియేటర్స్ లో ఆడియన్స్ ని ఎలా బయపెట్టాడో అంత తేలికగా ఆ అనుభూతిని మర్చిపోలేము. మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అతను, కచ్చితంగా నాగ చైతన్య తో చేయబోయే సినిమా కూడా అంతకు మించే ఉంటుందని ఊహించుకోవచ్చు. సుకుమార్ రైటింగ్స్ కూడా ఈ సినిమా నిర్మాణం లో భాగం అయ్యింది. ఈ చిత్రానికి వృష కర్మ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. అటవీ నేపథ్యం లో సాగే హారర్ థ్రిల్లర్ ఇది.
ఈ చిత్రంలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి నటిస్తుంది. షూటింగ్ కార్యక్రమాలు ఒక పక్క ప్రణాళిక తో పూర్తి చేసి, ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం మూడవ షెడ్యూల్ నడుస్తుంది. అంజనీష్ లోకానాధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్ దత్ సినిమాటోగ్రఫీ చేస్తున్నాడు. దాదాపుగా విరూపాక్ష చిత్రానికి పనిచేసిన టీం, ఈ సినిమాకు కూడా పని చేస్తుంది. నాగ చైతన్య కూడా ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ఇటీవల కాలంలో ఇలాంటి హారర్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఒక్క సినిమా కూడా రాలేదని, విడుదల తర్వాత దేశం మొత్తం మరోసారి మన టాలీవుడ్ వైపు చూసేలా ఈ చిత్రం ఉంటుందని అంటున్నారు.
Also Read : నాగ చైతన్య టాటూ ని తొలగించడానికి సమంత అంత పని చేసిందా..?