LSG Vs DC
LSG Vs DC: అతడు సినిమా(athadu movie)లో తనికెళ్ల భరణి(tanikella Bharani) మాట్లాడిన మాటలు టి20 క్రికెట్లో.. ముఖ్యంగా ఐపీఎల్ లో నికోలస్ పూరన్(Nicholas pooran) కు నూటికి నూరు కాదు.. నూటికి కోటిపాళ్ళు వర్తిస్తుంది. ప్రస్తుతం ఐపీఎల్ లో పూరన్ లక్నో జట్టు తరఫున ఆడుతున్నాడు. భారీ దేహంతో.. నిలువెత్తు శరీర సామర్థ్యంతో కనిపించే పూరన్ ప్రత్యర్థి బౌలర్ల పై ఏమాత్రం కనికరం చూపించడు. బంతి దొరికితే చాలు…బౌండరీ లైన్ దాటించడమో.. సిక్సర్ కొట్టడమో చేస్తుంటాడు. అందుకే పూరన్ ను ఐపీఎల్ లో నయా విధ్వంసకారుడు అని పిలుస్తుంటారు. ఇక సోమవారం ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.
Also Read: వాహ్.. ఏం అడావు భయ్యా.. ఈ ఒక్కడు ఢిల్లీ సైన్యమై గెలిపించాడు..
30 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 75 పరుగులు చేశాడు..మార్ష్ తో కలిసి రెండో వికెట్ కు 87 పరుగులు జోడించాడు. రిషబ్ పంత్ తో కలిసి మూడో వికెట్ కు 28 పరుగులు జోడించాడు. లక్నో జట్టు స్కోర్ 209 పరుగులుగా నమోదయింది అంటే దానికి ప్రధాన కారణం పూరన్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ లో 7 సిక్సర్లు కొట్టిన పూరన్ ఆర్థిక రికార్డును తన పేరు మీద సృష్టించుకున్నాడు.
అరుదైన మైలురాయి
లక్నో జట్టుకు ఆడుతున్న పూరన్.. టి20 లలో అరుదైన మైలురాయి అందుకున్నాడు. అన్ని టి20 లీగ్ లలో కలిపి 600 సిక్సర్లు కొట్టాడు. 2024 నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు 194 సిక్సర్ లను పూరన్ కొట్టాడంటే.. అతని విధ్వంసాన్ని అర్థం చేసుకోవచ్చు.. క్రిస్ గేల్ (1056), కిరన్ పొలార్డ్ (908), రస్సెల్ (733) పూరన్ ముందున్నారు. అయితే పూరన్ వయసు ప్రస్తుతం 29 సంవత్సరాలు మాత్రమే. అతడు అతి త్వరలోనే గేల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. యూనివర్సల్ బాస్ గా పేరుపొందిన గేల్ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పటివరకు అతడు అన్ని టి20 క్రికెట్ లీగ్లలో కలిపి 1056 సిక్సులు కొట్టాడు. అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్ల జాబితాలో గేల్ ప్రస్తుతం తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పూరన్ కనుక ఇదే జోరు కొనసాగిస్తే గేల్ రికార్డు గాల్లో కొట్టకపోవడం పెద్ద కష్టం కాదు. పూరన్ ఇప్పుడే కాదు.. గతంలో వెస్టిండీస్ వేదికగా జరిగిన క్రికెట్ లీగ్ లలో తన విశ్వరూపం చూపించాడు. ప్రత్యర్థులపై ఏమాత్రం కనికరం లేకుండా బ్యాటింగ్ చేశాడు. బంతితో ఏదో శత్రుత్వం ఉన్నట్టుగా బ్యాటింగ్ చేశాడు. అందువల్లే పూరన్ ను లక్నో జట్టు కొనుగోలు చేసింది. గత మెగా వేలంలో ఇతడిని కొనుగోలు చేయడానికి విపరీతమైన ఆసక్తి చూపించింది.
Also Read: ఏడు రన్స్ కే మూడు వికెట్లు.. పడి లేచిన కెరటంలా ఢిల్లీ గెలిచింది..