https://oktelugu.com/

Mad Square : ఆంధ్ర ప్రదేశ్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ టికెట్ రేట్స్ ఈ రేంజ్ లో ఉన్నాయేంటి!

Mad Square : ఈ సమ్మర్ కి యూత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి 'మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరంలో సూపర్ హిట్ గా నిల్చిన 'మ్యాడ్' చిత్రానికి సీక్వెల్ ఇది.

Written By: , Updated On : March 25, 2025 / 08:19 AM IST
Mad Square

Mad Square

Follow us on

Mad Square : ఈ సమ్మర్ కి యూత్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square). 2023 వ సంవత్సరంలో సూపర్ హిట్ గా నిల్చిన ‘మ్యాడ్’ చిత్రానికి సీక్వెల్ ఇది. మొదటి భాగానికి దర్శకత్వం వహించిన కళ్యాణ్ కృష్ణనే రెండవ భాగానికి కూడా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలకు ఇప్పటికే ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ఆడియన్స్ ఈ సినిమా నుండి ఏవైతే కోరుకుంటున్నారో, అవన్నీ ఉన్నాయని టీజర్ తోనే అర్థమైపోయింది. ఇప్పుడు థియేట్రికల్ ట్రైలర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే తెలంగాణ, ఓవర్సీస్ ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన బుకింగ్స్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉన్నారు.

Also Read : తెలుగు రాష్ట్రాల్లో నిరాశపర్చిన ‘మ్యాడ్ స్క్వేర్’ అడ్వాన్స్ బుకింగ్స్!

అయితే ఈ చిత్రానికి టికెట్ రేట్స్ పెంచుకోవడం నిర్మాత నాగవంశీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోగా, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ అనుమతిని ఇస్తూ నేడు ఉదయం జీవో ని విడుదల చేశారు. రేపటి నుండి బుకింగ్స్ ఆంధ్ర ప్రదేశ్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సింగల్ స్క్రీన్స్ కి 50 రూపాయలకు పెంచుకోవడానికి అనుమతిని ఇవ్వగా, మల్టీప్లెక్స్ థియేటర్స్ కి 70 రూపాయిలు పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చారు. అయితే నిర్మాతలు ఇలా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి అనుమతిని ఇచ్చినందుకు సంతోషించగా, మామూలు ఆడియన్స్ మాత్రం పెద్ద సినిమాలకు అంటే పెంచుకోవాలి తప్పదు, మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా టికెట్ రేట్స్ పెంచుకోవడం అవసరమా..?, ఇది కాస్త అతిశయోక్తి గా ఉందని అంటున్నారు. పైగా ఈ చిత్రానికి ఓవర్సీస్ లో అద్భుతమైన అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి కానీ, హైదరాబాద్ లో మాత్రం అంతంతమాత్రం గానే ఉంది.

ఇలాంటి తరుణంలో ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు టికెట్ రేట్స్ పెంచుకోవడం అవసరమా?, డిమాండ్ ఉన్నప్పుడు పెంచుకోవడం లో ఎలాంటి తప్పు లేదు, కానీ ఈ సినిమాకు మామూలు డిమాండ్ మాత్రమే ఉంది. అది కూడా నామమాత్రమే, అలాంటి సినిమాకు టికెట్ రేట్స్ పెంచడంలో ఎలాంటి అర్థం లేదని, వచ్చే డబ్బులను కూడా రానివ్వకుండా చేసుకుంటున్నారని విశ్లేషకులు చెప్తున్న మాట. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఆడియన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నేడే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా బాగున్నాయి. రిపోర్ట్స్ మాత్రం అదిరిపోయాయి. ఇప్పటికే ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తండేల్’, ‘కోర్ట్’ వంటి సంచలనాత్మక చిత్రాలతో మన టాలీవుడ్ మంచి ఊపులో ఉంది. ‘మ్యాడ్ స్క్వేర్’ ఆ ఊపుని ని ముందుకు కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Also Read : ‘మ్యాడ్ స్క్వేర్’ సెకండ్ హాఫ్ ని బయ్యర్స్ కి చూపించడానికి ఇష్టపడని నిర్మాత నాగవంశీ..అంత భయం ఎందుకు?