Naga Chaitanya , Samantha
Naga Chaitanya and Samantha : విడిపోయిన తర్వాత కూడా నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సమంత(Samantha Ruth Prabhu) గురించి సోషల్ మీడియా లో ఎదో ఒక వార్త ప్రచారం అవుతూనే ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ‘ఏ మాయ చేసావే’ అనే చిత్రంతో మొదలైన వీళ్లిద్దరి పరిచయం, ఆ తర్వాత ప్రేమగా మారి పెద్దల్ని ఒప్పించి పెళ్లి వరకు చేరింది. పెళ్లి చేసుకున్న తర్వాత నాలుగేళ్లు ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ, ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏర్పడిన పరస్పర విభేదాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. కానీ ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఈ జంట కచ్చితంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు విడిపోయిన తర్వాత ఆ వ్యవహారం ఒక సంచలనం గా మారింది. ఇకపోతే గత ఏడాది నాగ చైతన్య డిసెంబర్ నెలలో ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే.
Also Read : మహేష్ బాబు ఆ ఒక్క పని చేసి ఉంటే నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకునేవారు కాదా..?
సమంత కూడా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, కానీ అధికారికంగా ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా సమంత జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇకపోతే గతంలో నాగ చైతన్య సమంత గురించి సోషల్ మీడియా లో చెప్పిన ఒక మాట ఇప్పుడు మరోసారి అభిమానులు షేర్ చేసి బాగా వైరల్ చేసారు. ఇంతకు ఆ వీడియో లో ఏమి ఉందంటే’ నాకు సోషల్ మీడియా ని ఉపయోగించడం అసలు రాదు. నాకు ఏదైనా డౌట్ వస్తే సమంత కి ఫోన్ చేసి అడుగుతుంటాను. ఆమె సోషల్ మీడియా ని రెగ్యులర్ గా వాడుతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. ‘లవ్ స్టోరీ’ విడుదల సమయంలో ఆహా మీడియా లో స్ట్రీమింగ్ అయిన ఒక రానా దగ్గుబాటి టాక్ షో లో పాల్గొనగా, అక్కడ ఆయన అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం గా నాగ చైతన్య ఇలా చెప్పుకొచ్చాడు.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న నాగ చైతన్య కి రీసెంట్ గా విడుదలైన ‘తండేల్’ రూపం లో భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా వచ్చే సక్సెస్ ఊపుని ముందు సినిమాలకు కూడా కొనసాగించాలని చూస్తున్నాడు. మరోపక్క సమంత గత ఏడాది సిటాడెల్ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. ప్రస్తుతం ఆమె నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తున్న ‘రక్త బ్రహ్మాండ’ అనే వెబ్ సిరీస్ లో విలన్ రోల్ చేస్తుంది. ఈ వెబ్ సిరీస్ తో పాటు ఆమె ప్రధాన పాత్రలో ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాని మొదలు పెట్టింది. ఈ చిత్రానికి ఆమెనే నిర్మాత గా కూడా వ్యవహరిస్తుండడం విశేషం.
Also Read : నాగచైతన్య సినిమా కారణంగా సమంత కి అరుదైన పురస్కారం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!