Samantha and Naga Chaitanya : టాలీవుడ్ ఉన్నటువంటి స్టార్ హీరోయిన్స్ లో సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా ఉండే హీరోయిన్స్ లో ఒకరు సమంత(Samantha Ruth Prabhu). ఈమెకు ఇంస్టాగ్రామ్ ఒక డైరీ లాంటిది. తన జీవితంలో జరిగే ప్రతీ విషయాలను ఆమె ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులతో తన ఆలోచనలను పంచుకుంటూ ఉంటుంది. ఒకప్పుడు ట్విట్టర్ లో కూడా చాలా యాక్టీవ్ గా ఉండేది కానీ, నెగిటివిటీ అక్కడ ఎక్కువ ఉండడంతో ట్విట్టర్ వాడడం పూర్తిగా మానేసింది. ‘యశోద’, ‘శాకుంతలం’ సినిమాల సమయంలో ఆమె యాక్టీవ్ గా ఉండేది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. కానీ ఇంస్టాగ్రామ్ లో మాత్రం తన లేటెస్ట్ హాట్ ఫోటో షూట్స్ తో పాటు, తన దినచర్య మొత్తాన్ని అభిమానులకు షేర్ చేస్తూ ఉంటుంది. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను అప్లోడ్ చేసింది. అందులో నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో ఆమెకు ముడిపడి ఉన్న గుర్తులు కొన్ని బయటపడ్డాయి.
Also Read : ఆ సలహాల కోసం సమంత కి ఫోన్ కాల్ చేస్తుంటా అంటూ నాగచైతన్య షాకింగ్ కామెంట్స్!
సమంత, నాగచైతన్య సుమారుగా నాలుగేళ్ల పాటు డేటింగ్ చేసి , ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. డేటింగ్ చేస్తున్న సమయంలోనే సమంత నాగ చైతన్య మీద ప్రేమతో తన చేతిపై ఒక టాటూని వేయించుకుంది. ఈ టాటూ నిన్న మొన్నటి వరకు కూడా కనిపిస్తుండేది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె బలవంతంగా తొలగించే ప్రయత్నం చేసింది. రీసెంట్ గా ఆమె అప్లోడ్ చేసిన ఫోటోలలో ఈ విషయాన్నీ గమనించారు అభిమానులు. టాటూ ని తొలగించడానికి సమంత చాలా ప్రయత్నాలే చేసింది కానీ, దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉన్నాయి అని ఆమె అభిమానులు అంటున్నారు. దీనిని చూసిన తర్వాత నెటిజెన్స్ ఇప్పటికైనా ప్రేమికులు చేతులకు టాటూలను వేయించుకోవడం ఆపేయండి. భవిష్యత్తులో ఒకవేళ విడిపోవాల్సి వస్తే ఇలాంటి తిప్పలు ఎదురు అవుతుంటాయి. టాటూలు వేసుకున్న ప్రేమికులు విడిపోతూ ఉంటారు అనడానికి మరో నిదర్శనం సమంత, నాగ చైతన్య అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే, ఈమె పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము లేపేస్తుందని అందరూ అనుకున్నారు కానీ, అటు హిందీ లో కానీ, ఇటు తెలుగు లో కానీ ఇప్పుడు ఈమెకు అవకాశాలు రావడం లేదు. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన విలన్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచింది. ఈ సిరీస్ తర్వాత ఆమె ఎన్నో వెబ్ సిరీస్ లకు, సినిమాలకు సంతకం చేసింది. అందులో ఒక హాలీవుడ్ చిత్రం కూడా ఉంది. కానీ మయోసిటీస్ వ్యాధి కారణంగా అవన్నీ వదిలేసుకోవాల్సి వచ్చింది. చాలా కాలం వరకు విశ్రాంతి తీసుకొని బయటకు రీసెంట్ గానే వచ్చిన సమంత చేతిలో ప్రస్తుతం ‘రక్త బ్రహ్మాండ'(Rakta Bramhand) అనే నెట్ ఫ్లిక్స్(Netflix) వెబ్ సిరీస్, ‘మా ఇంటి బంగారం’ వంటి సినిమాలు ఉన్నాయి.
Also Read : నాగచైతన్య సినిమా కారణంగా సమంత కి అరుదైన పురస్కారం..పూర్తి వివరాలు చూస్తే ఆశ్చర్యపోతారు!