Homeఎంటర్టైన్మెంట్Naga Chaitanya Nagarjuna: కథల సెలెక్షన్ లో నాగార్జున సలహాలు తీసుకోవడం మానేసిన నాగ చైతన్య......

Naga Chaitanya Nagarjuna: కథల సెలెక్షన్ లో నాగార్జున సలహాలు తీసుకోవడం మానేసిన నాగ చైతన్య… అసలు కారణం ఇదే…

Naga Chaitanya Nagarjuna: ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందించిన వాళ్ళలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు… ఎన్టీఆర్ రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… ఇక తన తర్వాత తరంలో తన కొడుకు అయిన నాగార్జునను ఇండస్ట్రీకి తీసుకొచ్చాడు. నాగార్జున చాలా వరకు సక్సెస్ ఫుల్ సినిమాలను చేసి స్టార్ హీరోగా అవతరించాడు. ఇక ఇలాంటి క్రమంలోనే నాగార్జున కొడుకు అయిన నాగచైతన్య సైతం జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. కెరియర్ స్టార్టింగ్ లో నాగార్జున, నాగచైతన్యకు సంబంధించిన సినిమాల స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసేవాడు. కానీ ఇప్పుడు మాత్రం నాగచైతన్య తను ఓన్ గా స్క్రిప్ట్ లను సెలెక్ట్ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కారణమేంటంటే నాగచైతన్య చేయాల్సిన కొన్ని సూపర్ హిట్ సినిమాలను నాగార్జున రిజెక్ట్ చేశారట.

అందులో సార్, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలు ఉండడం విశేషం…అయితే ఈ రెండు కథలను దర్శకుడు వెంకీ అట్లూరి మొదట నాగచైతన్యకు వినిపించాడు. తను చేస్తే బాగుంటుందని చెప్పాడట. దాంతో నాగ చైతన్య సైతం ఆ సినిమాల మీద చాలా ఇంట్రెస్ట్ ని చూపించాడు.

కానీ నాగార్జున మధ్యలో ఎంట్రీ ఇచ్చి ఆ సినిమాల కథలు తనకి పెద్దగా నచ్చలేదని అవి నువ్వు చేస్తే పెద్దగా ఆడవని చెప్పారట. దాంతో నాగ చైతన్య ఆ కథలను రిజెక్ట్ చేశాడు. మొత్తానికైతే ఆ సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించడంతో నాగచైతన్య స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో ఎవ్వరి సలహాలు తీసుకోవద్దనే ఒక నిర్ణయానికి వచ్చాడట.

అందుకే ఆయన ఇప్పుడు తను ఒక కథ విన్న వెంటనే ఎవ్వరికి చెప్పకుండా తనే ఓన్ డిసిజన్ తో స్క్రిప్లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మొత్తానికైతే కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న ‘వృషకర్మ’ సినిమాతో భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు…ఈ మూవీ సూపర్ హిట్ అయితే నాగ చైతన్య స్టార్ హీరోగా మారే అవక్షమైతే ఉంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version