Pawan Kalyan angry on Ram Charan: రామ్ చరణ్ హీరోగా వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశాన్ని ప్రేక్షకులకు చెబుతుంటాడు. ‘చిరుత’ సినిమా నుంచి మొన్న వచ్చిన ‘గేమ్ చేంజర్’ సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక అంశాన్ని బలంగా చెబుతుంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో తను ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ను తీసుకొస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
మొత్తానికైతే ఈ సినిమాతో తనను తాను స్టార్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు. గతంలో ఆయన ‘రంగస్థలం’ సినిమాతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని నమోదు చేశాడు. ఇక ఈ సినిమా సమయంలోనే రామ్ చరణ్ కొన్ని యాక్షన్ సన్నివేశాలను ఒరిజినల్ గా చేశారట.
ఆ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అలా చేయడం కరెక్ట్ కాదని చెప్పారట. హీరో అనేవాడు చాలా విలువైన వ్యక్తి. కాబట్టి వాళ్లకి ఏదైనా ఇబ్బంది జరిగితే ప్రొడ్యూసర్లు చాలా వరకు నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి అయితే వస్తుందని అందువల్లే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో హీరోలకు డూప్ లను పెట్టి మేనేజ్ చేయాలని అలా ఒరిజినల్ స్టంట్ చేయకూడదని పవన్ కళ్యాణ్ అయితే రామ్ చరణ్ ను చెప్పాడట. మొత్తానికైతే రామ్ చరణ్ కొన్ని రిస్కీ షాట్స్ ని కూడా తనే ఓన్ గా చేయాలని అనుకుంటున్నాడు.
అందువల్లే ఆయన సినిమాల్లో యాక్షన్ సీక్వెన్స్ చాలా నేచురల్ గా ఉంటాయి. ఇక ఏది ఏమైనా కూడా అప్పటినుంచి మరోసారి రిస్కీ షాట్స్ చేయడం లేదట. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి మాటను రామ్ చరణ్ తూచ తప్పకుండా పాటిస్తాడు. కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పాడనే రామ్ చరణ్ రిస్కీ స్టంట్స్ చేయకుండా కొన్ని డూప్ తో చేయించుకుంటున్నాడట…