spot_img
Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Prabhas multistarrer movie: అల్లు అర్జున్ - ప్రభాస్ కాంబోలో మిస్ అయిన...

Allu Arjun Prabhas multistarrer movie: అల్లు అర్జున్ – ప్రభాస్ కాంబోలో మిస్ అయిన మల్టీ స్టారర్ మూవీ…దర్శకుడు ఎవరంటే…

Allu Arjun Prabhas multistarrer movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాటపడుతున్నారు…ఇతర భాషల హీరోలకు సాధ్యం కానీ రీతిలో మనవాళ్లు సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటున్నారు. భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మన హీరోలు చేస్తున్న సినిమాల విషయంలో చాలా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నారు.

కాబట్టి మన వాళ్లకు భారీ విషయాలైతే దక్కుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా పాన్ ఇండియాను షేక్ చేసే సినిమాలైతే చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో గతంలో ఒక మల్టీ స్టారర్ సినిమా రావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇంతకీ వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా చేయాలనుకున్న దర్శకుడు ఎవరు అంటే కరుణాకరన్ గా తెలుస్తుంది.

ఆయన ప్రభాస్ తో డార్లింగ్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఈ సినిమా అయిపోయిన తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్ లకు కలిపి ఒక కథనైతే వినిపించాడు. వాళ్ళిద్దరు ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏంటంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రభాస్ అల్లు అర్జున్ కి ఉన్న మార్కెట్ కంటే కూడా ఈ మూవీ బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది.

ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధించగలిగే కెపాసిటి ఉన్న హీరోలను కలిపి మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుందని వాళ్ళ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఫ్యూచర్లో ప్రభాస్ – అల్లు అర్జున్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...
Oktelugu Epaper
Exit mobile version