https://oktelugu.com/

Venu Swamy: వాడి జాతకం నేను చెబుతా… బండ బూతులు తిడుతూ వేణు స్వామికి చుక్కలు చూపించిన నాగ చైతన్య ఫ్యాన్!

అందరి జాతకాలు చెప్పే వేణు స్వామి జాతకం నేను చెప్తాను అంటున్నాడు నాగ చైతన్య ఫ్యాన్. వేణు స్వామి ఆఫీస్ కాల్ చేసిన అతడు చుక్కలు చూపించాడు. వేణు స్వామిని బండ బూతులు తిట్టిన నాగ చైతన్య ఫ్యాన్ ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని వెనకున్న సంగతి ఏంటో చూద్దాం

Written By:
  • S Reddy
  • , Updated On : August 12, 2024 / 05:41 PM IST

    Venu Swamy

    Follow us on

    Venu Swamy: జాతకాల పేరుతో ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వేణు స్వామికి పరిపాటిగా మారింది. వేణు స్వామి చిత్ర పరిశ్రమకు చెందినవాడే. రెండు దశాబ్దాలకు పైగా వేణు స్వామికి టాలీవుడ్ తో అనుబంధం ఉంది. యంగ్ ఏజ్ లో వేణు స్వామి టాలీవుడ్ లో జరిగే పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. అనంతరం జ్యోతిష్యుడిగా మారి పాప్యులర్ అయ్యారు. బడా నటులు, వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు వేణు స్వామి క్లైంట్స్. హీరో బాలకృష్ణ సైతం తనతో పూజలు చేయించినట్లు ఓ సందర్భంలో వేణు స్వామి తెలిపాడు.

    రష్మిక మందాన ఆయన పరమ భక్తురాలు. తరచుగా రష్మిక మందాన వేణు స్వామితో ప్రత్యేక పూజలు చేయిస్తుంది. అతనికి లక్షలు చెల్లిస్తుంది. వేణు స్వామి మాట ఆమె తూచా తప్పకుండా పాటిస్తుందట. అలాగే మరికొందరు హీరోయిన్స్ తో వేణు స్వామి పూజలు నిర్వహించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. వేణు స్వామి తన పూజల్లో మాంసం, మద్యం నైవేద్యంగా పెడతాడు.

    వేణు స్వామి జల్సా పురుషుడు కూడాను. సాయంత్రానికి హ్యాపీగా బార్ లో మద్యం సేవిస్తాడు. వృత్తికి, వ్యక్తిగత జీవితానికి సంబంధం లేదని అంటాడు. పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి హీరోల మీద వేణు స్వామి జాతకాల పేరిట అనుచిత కామెంట్స్ చేయడం వివాదాస్పదం అయ్యింది. ప్రభాస్ ని వేణు స్వామి కించపరుస్తూ మాట్లాడాడు. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేశారు. తాజాగా నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్లను ఉద్దేశించి వేణు స్వామి చేసిన కామెంట్స్ చర్చకు దారి తీశాయి.

    ఆగస్టు 8న నాగ చైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్నారు. వెంటనే వేణు స్వామి రంగంలోకి దిగాడు. జాతకాల విశ్లేషణ అంటూ ఓ వీడియో వదిలాడు. నాగ చైతన్య, శోభిత జాతకరీత్యా కలిసి ఉండే అవకాశం లేదు. 2027లోపే విడిపోతారు. ఓ స్త్రీ వలన వారి మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. విడాకులు తీసుకుంటారు, అన్నాడు. అలాగే నాగ చైతన్యకు తండ్రి అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సహజంగా తండ్రి కావడం కష్టమంటూ.. అభిమానులు హర్ట్ అయ్యేలా మాట్లాడాడు.

    ఈ క్రమంలో నాగ చైతన్య అభిమాని ఒకరు వేణు స్వామి ఆఫీస్ కి కాల్ చేశారు. రిసెప్షనిస్ట్ తో వేణు స్వామి అపాయింట్మెంట్ కావాలని మర్యాదగా మొదలుపెట్టి మెల్లగా ఫైర్ అయ్యాడు. వాడి జాతకం నేను చెబుతాను. శుభమా అంటూ నాగ చైతన్య పెళ్లి చేసుకుంటుంటే జాతకాల పేరుతో పిచ్చి కూతలు కూస్తాడా అని… ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నదే చెప్పాడని రిసెప్షనిస్ట్ సమర్ధించుకునే ప్రయత్నం చేసింది. వేణు స్వామి చెప్పిన చాలా విషయాలు తప్పయ్యాయని నాగ చైతన్య ఫ్యాన్ విరుచుకుపడ్డాడు. ఈ ఆడియో కాల్ రికార్డు వైరల్ అవుతుంది.

    మరోవైపు వేణు స్వామికి మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు కాల్ చేశారట. జాతకాలు ఎందుకు చెబుతున్నావని అడిగారట. దీంతో ఇకపై నేను జాతకాలు చెప్పనని వేణు స్వామి ఓ వీడియో బైట్ విడుదల చేశాడు. గతంలో కూడా ఇకపై సెలెబ్రిటీ జాతకాలు నేను చెప్పనని వేణు స్వామి హామీ ఇచ్చి మాట తప్పారు.