PM Modi : సల్మాన్ ఖుర్షీద్, సజ్జన్ సింగ్ పై కాంగ్రెస్ వేటు వేయలేదు. ప్రభుత్వం కేసు వేయలేదు.తిరుగుబాటును లేవనెత్తిన నేతలపై వేటు వేయకుండా.. క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ఇది నిజంగా దేశ దౌర్భాగ్యం. వీటిపై చర్యలు తీసుకోకపోవడంతో సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టమొచ్చినట్టు వాళ్లు పోస్టులు పెడుతున్నారు. బంగ్లాదేశ్ లోలాగా తిరుగుబాటు రావాలని ఇక్కడి ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి.
కానీ బంగ్లాదేశ్ లాగా మన ఇండియా ఎప్పటికీ కాదు.. ఇందుకు కారణాలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లో వచ్చిన ఆందోళన ఏంటి అని చూస్తే.. ‘కుటుంబ పాలనకు వ్యతిరేకంగా.. వారసత్వ పాలనకు వ్యతిరేకంగా సాగించిన యుద్ధమిదీ’.. స్వాతంత్ర్యం తెచ్చామని.. మాకే పాలనాధికారం అంటూ మాకే రిజర్వేషన్లు ఉండాలని అనడమే వివాదమైంది.. ఈ పద్ధతుల్లో విర్రవీగిన షేక్ హసీనాలాంటి నేతలను తరిమికొట్టాలని విద్యార్థులు అంతా రోడ్డు ఎక్కడం వల్ల ఈ ఉద్యమం తీవ్రమైంది.
వారసత్వ హక్కులు మావి అన్న దానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేశారు. దీన్ని భారత్ కు అన్వయిస్తే పూర్తి వ్యతిరేకం.. భారత్ లో ఈ వారసత్వం , కుటుంబ పాలన ఎవరికి ఉంది.. మోడీకి ఉందా? నెహ్రూకు ఉందా? కాంగ్రెస్ పార్టీకి ఉందా? అన్నది చూడండి.. ఇది రాహుల్ గాంధీకే నష్టం. కాంగ్రెస్ ది వారసత్వ పాలన అని తెలియక రాహుల్ మాట్లాడుతున్నాడు.
మోడీ వ్యతిరేకతతో దేశంలో తిరుగుబాటుకు పిలుపిస్తే జనం వాళ్ళను తరిమి తరిమి కొడతారు.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.