Naga Chaitanya Emotional Comments: అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) , సమంత విడాకులు తీసుకున్న తర్వాత వీళ్లిద్దరి పై సోషల్ మీడియా లో ఏ రేంజ్ లో నెగెటివిటీ జరిగిందో అందరికీ తెలిసిందే. సమంత మద్దతు దారులు నాగచైతన్య పై, నాగ చైతన్య మద్దతుదారులు సమంత పై తీవ్రమైన నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో వీళ్లిద్దరు ఏ చిన్న పోస్ట్ పెట్టినా , వందల సంఖ్యలో నెగెటివ్ కామెంట్స్ వస్తుండేవి. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇకపోతే రీసెంట్ గానే నాగ చైతన్య శోభిత ని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే . ఈ సంఘటన జరిగినప్పటి నుండి శోభిత పైన కూడా తీవ్రమైన నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఆమె ఏ పోస్ట్ పెట్టినా, వినలేని పదాలతో ఇష్టమొచ్చినట్టు దూషిస్తూ, శోభిత ని నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో తనపై ఏర్పడిన నెగెటివిటీ పై రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
ఆయన మాట్లాడుతూ ‘నా భార్య శోభిత ని చూస్తే చాలా జాలీ వేస్తోంది. తానూ చెయ్యని తప్పుకి ఎన్నో నిందలు ఎదురుకోవాల్సి వచ్చింది. సోషల్ మీడియా లో కొంతమంది ఆమెని నిందిస్తూ చేసిన కామెంట్స్ కి శోభిత ఎన్నో సందర్భాల్లో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె బాధని చూసి నేను తీవ్రమైన వేదనకు గురయ్యాను. ఒక కాఫీ షాప్ లో మా ఇద్దరి ప్రేమకు భీజం పడింది. ఆ తర్వాత పారదర్శకమైన రిలేషన్ ని మైంటైన్ చేస్తూ, మా తల్లిదండ్రులకు చెప్పి ఈ వివాహం చేసుకున్నాము. నిజాయితీగా మా జీవితాన్ని మేము గడుపుతున్నాము , కానీ సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ చేసే కామెంట్స్ మమ్మల్ని చాలా బాధిస్తున్నాయి’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ చైతన్య.
ఇక ఆయన చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు తో ‘వృషకర్మ’ అనే మిస్టిక్ హారర్ థ్రిల్లర్ చేస్తున్నాడు నాగ చైతన్య. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న ఆయన గత ఏడాది ‘తండేల్’ చిత్రం తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని , కెరీర్ లోనే మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాని అందుకున్నాడు. ఇప్పుడు ‘వృష కర్మ’ తో తన సక్సెస్ ట్రాక్ ని ముందుకు కొనసాగిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య శేఖర్ కమ్ముల దర్శకత్వం లో ఒక సినిమా చేసే అవకాశం ఉంది.