Naga Chaitanya: ఒకప్పుడు సెలెబ్రిటీల పెళ్లి వేడుకలు మనకు టీవీ చానెల్స్ లో లైవ్ టెలికాస్ట్ అయ్యేవి. కానీ ఇప్పుడు మొత్తం కమర్షియల్ అయిపోయింది. కొంతమంది స్టార్ సెలెబ్రిటీలు ఈమధ్య తమ పెళ్లి వీడియోలను డాక్యుమెంటరీ రూపం లో తయారు చేయించి ఓటీటీ సంస్థలకు భారీ రేట్స్ కి అమ్మేస్తున్నారు. నయనతార, సతీష్ విగ్నేష్ పెళ్లి డాక్యుమెంటరీ కూడా ఇలాగే కొద్దినెలల క్రితం నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. ఈ డాక్యుమెంటరీ కోసం నయనతార ఏకంగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుందట. ఈ డాక్యుమెంటరీ లో తన అనుమతి లేకుండా తన సినిమాకి సంబంధించిన కొన్ని షాట్స్ ని తీసుకున్నందుకు హీరో ధనుష్ నయనతార పై పది కోట్ల రూపాయిల పెనాల్టీ వేస్తూ కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ కేసు నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు నయనతార బాటలోనే నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్ళికి సంబంధించిన డాక్యుమెంటరీ వీడియో కూడా నెట్ ఫ్లిక్స్ లోకి రానుందట.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనుంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. నాగ చైతన్య పెళ్లి, సమంత తో విడాకులు వంటి అంశాలు నేషనల్ లెవెల్ లో సెన్సేషనల్ టాపిక్స్ అయ్యాయి. ఇప్పటికీ ఈ అంశం గురించి సోషల్ మీడియా లో ప్రతిరోజు చర్చలు నడుస్తూనే ఉంటాయి. అంత క్రేజ్ ఉన్న అంశం కాబట్టే, ఆయన పెళ్లి వీడియో ని డాక్యుమెంటరీ గా చేసి విడుదల చేయబోతున్నారు. అందుకోసం నెట్ ఫ్లిక్స్ సంస్థ నాగ చైతన్య డంపుటలకు ఏకంగా పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో రెండు నెలల్లో ఈ వీడియో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాగ చైతన్య, శోభిత మధ్య ప్రేమ ఎలా చిగురించింది అనేది ఇప్పటికీ మిస్టరీనే. ఎందుకంటే వీళ్ళు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు.
అంతకు ముందు పెద్దగా కలుసుకున్నట్టు కూడా వార్తలు వినిపించలేదు. సమంత తో విడాకులు జరిగిన రెండు నెలలకే ఆయన శోభిత తో వరల్డ్ టూర్స్ వేస్తూ ఆమెతో కలిసి ఫోటోలు దిగి కనిపించాడు. ఇది చూసి అందరు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. వీళ్లిప్పుడు ప్రేమించుకున్నారు, పెళ్లి దాకా మ్యాటర్ ఎలా వెళ్ళింది అనేది అర్థం అవ్వక జుట్టు పీక్కున్నారు. వీటి అన్నిటికి సమాధానం ఈ డాక్యుమెంటరీ ఇవ్వనుంది. వీళ్ళ పరిచయం దగ్గర నుండి పెళ్లి వరకు ఎలా జరిగింది అనేది వివరంగా ఈ డాక్యుమెంటరీ లో చూపించబోతున్నారు. ఇది చూసిన తర్వాత అందరికీ ఒక క్లారిటీ రావొచ్చు, నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోవడం లో ఎవరి తప్పు ఉంది అనేది. ఇకపోతే నాగ చైతన్య హీరో గా నటించిన తండేల్ చిత్రం మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై కేవలం అభిమానుల్లోనే కాకుండా ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.