God : ప్రజలు దేవుడిని ఎక్కువగా నమ్ముతుంటారు. ఎన్నో పూజలు, పునస్కారాలు కూడా చేస్తుంటారు. నిత్యం దైవారాధన లో ఉండే వారు చాలా ఎక్కువ. ప్రతి రోజు దీపారాధన చేస్తూ దేవుడికి దూపదీప నైవేద్యాలు పెడుతుంటారు. ఇక ఎలాంటి సమస్య వచ్చిన కూడా ఆ దేవుడే కాపాడతాడు అని ఎక్కువగా నమ్ముతారు భక్తులు. ఇక ఆ పరమేశ్వరుడికి అయితే మరింత ఎక్కువ మంది భక్తులు ఉంటారు. కోట్ల దేవుళ్ళు మనుషుల మనుగడకు కారణం అని వారి వల్లే ఈ జీవ కోటి జీవితం సుగమం అవుతుందని నమ్ముతారు.
కానీ గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే దేవుడి ఆ దీపాన్ని రక్షిస్తాడా? ఇంట్లో కూర్చొని కోటి రూపాయలు రావాలి అంటే సాధ్యం అవుతాయా? దేవుడికి కష్టపడే వారే ఇష్టం. మంచి మనసుతో కల్మషం లేని వారి మీద దేవుడి దయ ఎప్పుడు ఉంటుంది అంటారు పండితులు. అందుకే కష్టం చేస్తూ ప్రయోజనాలను ఆశించాలి. మీ కష్టం వెనుక ఆ దేవుడు పక్కా ఉంటారు అని అంటారు కొందరు. అయితే దేవుడి మీద కొందరు ఎంత గుడ్డిగా నమ్మకం పెట్టుకుంటారో వారి అజ్ఞానం ఏ విధంగా ఉంటుందో, ఇంతకీ దేవుడు ఎవరి రూపంలో ఎలా వస్తాడో స్టార్ హీరో లారెన్స్ ఓ కథ ద్వారా తెలిపాడు. మరి ఆయన చెప్పిన ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఒక వ్యక్తి నీటిలో ఉన్నప్పుడు ఆయన మునిగిపోతుంటాడు. దేవుడా నన్ను రక్షించు అని వేడుకుంటాడు ఆ భక్తుడు. అతను మునిగే సమయానికి ఓ వ్యక్తి పడవలో వచ్చి కాపాడే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ వ్యక్తి నేను రాను ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నువ్వు వెళ్ళు అంటాడు. ఆ తర్వాత మరో వ్యక్తి స్టీమర్ లో వచ్చి త్వరగా రా అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి గొంతు వరకు నీరు వస్తుంది. అయినా సరే నేను రాను ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నువ్వు వెళ్ళు అంటాడు. మరింత లోపలికి మునిగే సమయంలో మరో వ్యక్తి విమానంలో వచ్చి త్వరగా రా అంటాడు. అయినా సరే నేను రాను ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడుతాడు నువ్వు వెళ్లు అంటారు. ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోతాడు.
చివరకు పూర్తిగా నీటిలో మునిగి చనిపోయాడు ఆ వ్యక్తి. తర్వాత స్వర్గానికి వెళ్లి ఏంటి దేవుడా నేను చనిపోతుంటే కాపాడలేదు అని అడుగుతాడు. అప్పుడు దేవుడు నేను నిన్ను మూడుసార్లు కాపాడటానికి వచ్చాను కానీ నువ్వు అది కనిపెట్టకుండా దేవుడు వస్తాడు అంటూ నన్ను పంపించేశావు అని చెప్తాడు. నేను మనిషి రూపంలో వచ్చి నిన్ను కాపాడాలి అనుకుంటే నీ మూర్ఖపు ఆలోచనతో మరణించావు. నేను స్వయంగా వచ్చి నీకు కనిపిస్తే నా రూపాన్ని చూసి నువ్వు తట్టుకోగలవా? అంటూ సమాధానం చెప్తాడు దేవుడు.
https://www.youtube.com/shorts/jtBSnAReOmA
లారెన్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ స్టార్ నటుడికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఈయన ఎంతో మంది పిల్లలకు, ప్రజలకు సహాయం చేస్తున్నారు. ఇక ఈ కథ లారెన్స్ చెప్పిన తర్వాత దేవుడు మీ రూపంలోనే వచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.