Kalki 2898 AD : కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.. నాగ్ అశ్విన్ బయటపెట్టిన ఆసక్తికర విషయాలు…

Kalki 2898 AD : మహేష్ బాబు ను ఈ సినిమాలో కృష్ణుడు పాత్ర కోసం తీసుకుంటే బాగుండేది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి నాగ్ అశ్విన్ సమాధానం గా ఆయన ఈ సినిమాలో కాదు వేరే సినిమాలో కృష్ణుడి గా చేస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు.

Written By: NARESH, Updated On : July 5, 2024 9:47 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD : కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఇండియాలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ఇక రాజమౌళి తర్వాత తెలుగు నుంచి వచ్చిన మరో భారీ డైరెక్టర్ గా కూడా బాలీవుడ్ ప్రేక్షకులు నాగ్ అశ్విన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇక తనకు ఇది మూడో సినిమా అయినప్పటికీ అంతమంది స్టార్ కాస్టింగ్ ను పెట్టుకొని హైలీ గ్రాఫిక్స్ ఎపిసోడ్స్ ఉన్న కూడా తను ఏ మాత్రం కన్ఫ్యూజన్ లేకుండా చాలా క్లారిటీగా తెరకెక్కించాడు. ఇక దానికి ఆయన విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఇక హాలీవుడ్ మీడియా సైతం కల్కి సినిమా గురించి మాట్లాడుతుంది. అంటే నిజంగా ఇది తెలుగు వాళ్లకు ఒక అరుదైన గౌరవం అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కల్కి సినిమాకి సీక్వెల్ గురించి ప్రణాళికలను రూపొందిస్తున్నాడు. ఇక అందులో భాగంగానే రీసెంట్ గా మీడియాతో మాట్లాడిన ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానాలనైతే తెలియజేశాడు. ఇక అందులో ముఖ్యంగా మహేష్ బాబు ప్రస్తావన రావడం ఒక మంచి విషయమనే చెప్పాలి. మహేష్ బాబు ను ఈ సినిమాలో కృష్ణుడు పాత్ర కోసం తీసుకుంటే బాగుండేది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి నాగ్ అశ్విన్ సమాధానం గా ఆయన ఈ సినిమాలో కాదు వేరే సినిమాలో కృష్ణుడి గా చేస్తే బాగుంటుందని సమాధానం ఇచ్చాడు.

ఎందుకంటే ఈ సినిమాలో కృష్ణుడు పాత్ర చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఆయన ఇమేజ్ కి ఇందులో చూపించిన క్యారెక్టర్ కి సెట్ అవదు. అదే వేరే సినిమాలో ఆయనకి ఫుల్ లెంత్ కృష్ణుడి క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఆయన కూడా చాలా బాగా పెర్ఫార్మ్ చేయగలరు అనే ఉద్దేశంతోనే నాగ్ అశ్విన్ అలా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది…

ఇక కల్కి 2 సినిమా గురించి చెబుతూ ఈ సినిమాలో కథ చాలా డెప్త్ గా ఉంటుందని ఇందులో ప్రభాస్ పాత్ర చాలా పెద్దగా ఉంటుందని కూడా ఆయన తెలియజేసాడు. ఇక దాంతో పాటుగా కల్కి క్యారెక్టర్ ఎవరు పోషిస్తున్నారు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇక కల్కి 2 సినిమా రిలీజ్ అయితే తప్ప కల్కి ఎవరు అనేది ఎవరికీ తెలియదు అన్నట్టుగా ఆయన ఆ విషయాన్ని కవర్ చేస్తూ మాట్లాడాడు…