Nag Ashwin : సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. పలానా నటుడు తన సినిమాలో ఉంటే ఆ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మేవారు ఉన్నారు. అలాగే హీరో క్యారెక్టర్ కి కొన్ని పేర్లు పెడితే ఆ సినిమాలు సక్సెస్ అవుతాయని అనుకునే దర్శకులు ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు. ఇక కల్కి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న నాగ్ అశ్విన్ కూడా కొన్ని సెంటిమెంట్లని అలాగే లక్కీ అన్ లక్కీ అనే పద్ధతులను కూడా నమ్ముతాడనే విషయాన్ని తనే స్వయంగా చెప్పడం విశేషం…
అయితే ఆయన ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన మాళవిక నాయర్, అలాగే కీలకపాత్రలో నటించిన విజయ్ దేవరకొండలను తను చేసిన మూడు సినిమాల్లో కూడా తీసుకోవడం విశేషము. ఇక ఇదే విషయాన్ని రీసెంట్ గా ఒక మీడియా సంస్థ వారు నాగ్ అశ్విన్ ను అడగగా వాళ్ళని తీసుకోవడానికి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు.
నా మొదటి సినిమాలో నటించిన నటి నటులు కాబట్టి వాళ్ళని లక్కీ పర్సన్స్ గా నేను భావిస్తాను. అందువల్లే వాళ్ళు నా సినిమాల్లో ఉంటే నాకు హెల్ప్ అవుతుందని, నా సినిమా సక్సెస్ అవుతుందనే ఉద్దేశంతోనే వారిని నా సినిమాల్లో తీసుకుంటున్నాను తప్ప అంతకుమించి మరి ఏమి లేదని ఆయన చెప్పడం విశేషం… కల్కి 2 సినిమాను కూడా తొందర్లోనే సెట్స్ మీదికి తీసుకెళ్ళి శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత ఫాస్ట్ గా ఆ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
కల్కి 2 సినిమాలో గెస్ట్ అప్పిరియన్స్ ఉంటాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పుడు అందుతున్న కథనాలను బట్టి చూస్తే కల్కి లో విజయ్ దేవర కొండ చేసిన క్యారెక్టర్ గెస్ట్ రోల్ కాదని నాగీ చెప్పాడు. అంటే ఆయనకు సంబంధించిన పాత్ర ఇంకా పార్టీ 2 లో ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికి పార్ట్ 2 కి సంబంధించిన 20 రోజుల షూటింగ్ పూర్తి చేసినట్టుగా నాగ్ అశ్విన్ ఒక క్లారిటీ ఇచ్చాడు. మరి మిగతా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు అనే దాని మీదనే ఈ సినిమా రిలీజ్ డేట్ అనేది ఆధారపడి ఉంది…