https://oktelugu.com/

OG Movie : దసరా నుండి ‘ఓజీ’ జాతర మొదలు..ఫ్యాన్స్ పిచ్చెక్కిపోయే వార్త చెప్పిన మ్యూజిక్ డైరెక్టర్ థమన్!

మనమంతా అతన్ని ఓజీ అని పిలుస్తాం.. అతి త్వరలోనే మాస్ ర్యాంపేజ్ మొదలు కాబోతుంది' అంటూ డైరెక్టర్ సుజిత్, తమిళ హీరో శింబు తో కలిసి ఉన్న ఫోటో ని అప్లోడ్ చేసాడు థమన్.

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2024 / 09:05 PM IST

    OG Movie(1)

    Follow us on

    OG Movie : రాజకీయ చరిత్రలో నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ తో జనసేన పార్టీ ని గెలిపించి చరిత్ర తిరగరాసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎంత ఎత్తుకి ఎదిగిన అభిమానులకు సినిమాలు కావాల్సిందే, లేదంటే అసలు ఒప్పుకునే పరిస్థితే లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ, ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డాడు. రేపటి నుండి ఆయన ‘హరి హర వీరమల్లు’ చిత్రాన్ని తిరిగి ప్రారంభించబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి కేవలం 20 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ‘ఓజీ’ చిత్రం కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో మన అందరికీ తెలిసిందే.

    ఈ సినిమాని ప్రకటించిన రోజు నుండే అంచనాలు తారాస్థాయిలో మొదలయ్యాయి. ఇక ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చేయగా, అప్పటి వరకు ఉన్న అంచనాలు పదింతలు పెరిగింది. ఇది కదరా అసలు సిసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే, ఇక కదరా సినిమా తియ్యాలి అని అభిమానులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ నెల 27 వ తారీఖున ఓజీ చిత్రం విడుదల అవ్వాల్సింది. కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీ గా ఉండడంతో ఓజీ స్థానం లో ‘దేవర’ చిత్రం విడుదల అవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఒక సెన్సేషనల్ అప్డేట్ ని కాసేపటి క్రితమే ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ తెలిపాడు. ఆయన మాట్లాడుతూ ‘ మీ అందరికి తెలుసు..మనమంతా అతన్ని ఓజీ అని పిలుస్తాం.. అతి త్వరలోనే మాస్ ర్యాంపేజ్ మొదలు కాబోతుంది’ అంటూ డైరెక్టర్ సుజిత్, తమిళ హీరో శింబు తో కలిసి ఉన్న ఫోటో ని అప్లోడ్ చేసాడు థమన్.

    దీంతో ఒక్కసారిగా ఈ ఫోటో సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఆ తర్వాత మూవీ యూనిట్ కూడా దసరా కి ఓజీ మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసారు. ఈ పాట హీరో క్యారక్టర్ ని లేపుతూ ఉంటుందట. జైలర్ చిత్రం లో ‘హుకుం’ పాట మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ పాట తరహాలో, దానికి మించి సౌత్ ఇండియా మొత్తం మారుమోగిపోయేలా ఈ పాట ఉండబోతుందట. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని గా పిలవబడే తమిళ స్టార్ హీరోలలో ఒకరైన శింబు ఈ పాటకు తన గాత్రం అందించాడు. గతంలో ఆయన తెలుగు లో అనేక సినిమాలకు పాటలు పాడాడు, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పాట పాడే అదృష్టం కోసం ఎదురు చూస్తున్నాను అంటూ శింబు అప్పట్లో చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లకు ఆయన కోరిక నెరవేరింది. చూడాలి మరి ఈ పాట ఏ రేంజ్ లో ఉండబోతుందో.