https://oktelugu.com/

Sreeleela : తన పెళ్లి గురించి షాకింగ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్ శ్రీలీల..పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇక ప్రేమించడానికి సమయం ఎక్కడిది' అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ ఏడాది ఆమె మహేష్ బాబు తో కలిసి నటించిన 'గుంటూరు కారం' చిత్రం సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2024 / 09:29 PM IST

    Sreeleela

    Follow us on

    Sreeleela : యూత్, మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నేటి తరం హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. ‘పెళ్లి సందడి’ చిత్రం తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె, తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఎంతలా ఆకర్షించిందో మనమంతా చూసాము. ఆ చిత్రంలో ఈమె నటన, డ్యాన్స్, అందం ని చూసి ప్రేక్షకులు పిచ్చెక్కిపోయారు, ఇండస్ట్రీ లో శ్రీలీల ఆ చిత్రం తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయింది. ఇక ఆ సినిమా తర్వాత మాస్ మహారాజ రవితేజ తో కలిసి ‘ధమాకా’ చిత్రం చేసింది. ఈ చిత్రం కమర్షియల్ గా ఎలాంటి హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఇప్పటి వరకు రాలేదు. ‘ధమాకా’ తర్వాత ఈమె అరడజనకు పైగా సినిమాలు చేసింది.

    వాటిలో కేవలం ‘భగవంత్ కేసరి’ చిత్రం మాత్రమే సూపర్ హిట్ గా నిల్చింది, మిగిలినవన్నీ ఫ్లాప్ అయ్యాయి, అయినప్పటికీ కూడా శ్రీలీల కి ఇంత క్రేజ్ ఉండడం, అవకాశాలు తగ్గకపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే శ్రీలీల గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో ఒక రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే శ్రీలీల చదువుకునే ఎంబీబీఎస్ కాలేజీ లో ఒక అబ్బాయిని ఘాడంగా ప్రేమించిందని, అతనినే ఈమె పెళ్లి చేసుకోబోతుందని, వీళ్లిద్దరు కలిసి బెంగళూరు పబ్స్ లో తిరగడం అనేక మంది చూశారట. దీని గురించి కర్ణాటక మీడియా ప్రత్యేకంగా కథనాలు కూడా ప్రచారం చేసింది. అయితే దీనిపై నేడు శ్రీలీల మీడియా కి క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నాపై సోషల్ మీడియా లో ఏవేవో రూమర్స్ వస్తున్నాయి. నేను ఎవరినీ ప్రేమించడం లేదు, అసలు పెళ్లి పై నా దృష్టే లేదు. చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక సినిమా చేసి ఆపి చదువుకుందాం అనుకున్నాను. కానీ ఆఫర్ల వెల్లువలాగా వచ్చేలోపు సినిమాలు చేస్తూ చదువుకుంటూ ఉన్నాను. ప్రస్తుతం నా ద్రుష్టి సినిమాలు, చదువు మాత్రమే ఉంది. వీటిని చూసుకునేందుకే సమయం సరిపోవడం లేదు.

    ఇక ప్రేమించడానికి సమయం ఎక్కడిది’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీలీల. ఈ ఏడాది ఆమె మహేష్ బాబు తో కలిసి నటించిన ‘గుంటూరు కారం’ చిత్రం సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇప్పుడు ఆమె చేతిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే పెద్ద సినిమా మాత్రమే ఉంది. ఆ తర్వాత నితిన్ తో ‘రాబిన్ హుడ్’ అనే చిత్రం, రవితేజ తో ఒక చిత్రం చేస్తుంది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా కన్నడలో ఒక సినిమా, హిందీ లో రెండు సినిమాలు, తమిళం లో అజిత్ హీరో గా నటిస్తున్న ‘గుడ్..బ్యాడ్..అగ్లీ’ అనే చిత్రం లో నటించేందుకు సంతకాలు చేసింది శ్రీలీల.