https://oktelugu.com/

Devara pre-release event : 2 కిలోమీటర్ల మేరకు జనాలు.. ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని క్యాన్సిల్ చేస్తాం అంటున్న పోలీసులు!

ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదట. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నారు నెటిజెన్స్.

Written By:
  • NARESH
  • , Updated On : September 22, 2024 / 08:52 PM IST

    Devara

    Follow us on

    Devara pre-release event : కోట్లాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ‘దేవర’ చిత్రం ఎట్టకేలకు మరో 5 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. దాదాపుగా ఆరేళ్ళ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నుండి విడుదల అవుతున్న సోలో హీరో చిత్రమిది. కొరటాల శివ ‘ఆచార్య’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత, ఎంతో కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించి, ఎలా అయినా సూపర్ హిట్ కొట్టాలి, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యాలి అనే కసితో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పాటలు అదిరిపోయాయి, టీజర్ బాగుంది, కానీ ట్రైలర్స్ మాత్రం అనుకున్నంత ఫ్యాన్స్ కి నచ్చలేదు. అంచనాలకు తగ్గట్టుగా ట్రైలర్ ఉండుంటే, ఈ చిత్రం ఓవర్సీస్ లో #RRR ప్రీమియర్ రికార్డ్స్ ని కూడా బద్దలు కొట్టేదని అంటున్నారు విశ్లేషకులు. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 1.6 మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

    ఇది చాలా పెద్ద గ్రాస్ అయినప్పటికీ కూడా, ట్రైలర్ కారణంగా 3 మిలియన్ డాలర్ గ్రాస్ వసూళ్లను అడ్వాన్స్ బుకింగ్స్ నుండి రాబట్టేంత సత్తా ఉన్న ఈ చిత్రం, కేవలం 2 మిలియన్ డాలర్స్ వద్ద ఆగే అవకాశం ఉందని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే నేడు ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని నోవెటల్ హోటల్ లో నిర్వహించిన సంగతి తెల్సిందే. ముందుగా ఈ ఈవెంట్ ని ఏదైనా ఓపెన్ గ్రౌండ్ లో చేయాలని మేకర్స్ అనుకున్నారు, కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో నోవెటల్ లో ఏర్పాటు చేసారు. మితిమీరిన జనాలు ఈ ఈవెంట్ కి హాజరు అవ్వడం తో నోవెటల్ హోటల్ పరిసర ప్రాంతాలు మొత్తం ట్రాఫిక్ అయ్యింది. కనుచూపు మేరా ఎక్కడ చూసినా జనాలు ఉండడం వల్ల పోలీసులు కంట్రోల్ కూడా చేయలేని పరిస్థితి. దీంతో అనేకమంది అభిమానులను పాసులు ఉన్నప్పటికీ కూడా లోపలకు అనుమతించలేదు పోలీసులు. దీనిపై నోవెటల్ ప్రాంతం లో పెద్ద రగడ అయ్యింది. అభిమానులు ధర్నాలు చేస్తూ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. కంట్రోల్ లో ఉండకపోతే ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని రద్దు చేస్తాము అంటూ బెదిరిస్తున్నారు.

    ఇప్పుడు నోవెటల్ ప్రాంత పరిస్థితి ఎలా ఉందంటే, స్వయంగా మూవీ యూనిట్ తో పాటు, జూనియర్ ఎన్టీఆర్ కూడా లోపలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. నోవెటల్ ఇలాంటి వేడుకలకు చాలా చిన్నది అనే చెప్పాలి. గతంలో పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితులే ఏర్పడ్డాయి. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. అసలు ఉంటుందా లేదా అనే అనుమానం తో ఉన్నారు అభిమానులు. లోపలకు అడుగుపెట్టిన అభిమానులకు ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదట. ఉద్రిక్తత పరిస్థితుల నడుమ జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని కోరుకుంటున్నారు నెటిజెన్స్.