ఈ కరోనా సమయంలో క్రియేటర్స్ కి మంచి ఖాళీ టైం దొరుకుతుంది. దాంతో తమలో క్రియేటివిటీ లేకపోయినా అందరూ కథల పై కూర్చుంటున్నారు. అలాగే తానూ ప్రస్తుతం చాలా రిలాక్స్ అయ్యాయని హీరోయిన్ నిత్యా మీనన్ చెప్పుకొస్తోంది. ఎంతైనా నిత్య మీనన్ మల్టీ టాలెంటెడ్ హీరోయిన్, నిజానికి ఆమెకు యాక్టింగ్ పై కంటే కూడా డైరెక్షన్ పైనే ఎక్కువ మక్కువ.
అందుకే తానూ ఏ రోజుకు అయినా డైరెక్షన్ చేస్తానని అంటుంది. ఒకవిధంగా తన యాంబీషన్స్ లో ముఖ్యమైనది డైరెక్షనేనట. అందుకే పోయిన లాక్ డౌన్ లోనే ఒక ఆన్ లైన్ స్క్రిప్ట్ కోర్సు కూడా చేసింది నిత్యా. పైగా స్క్రిప్ట్ కోర్సులో తానూ నేర్చుకున్న అంశాల పై, అలాగే తన కథకు సంబంధించి సీన్స్ పై కసరత్తు కూడా చేసిందట. పనిలో పనిగా స్క్రిప్ట్ కూడా రాసిందట.
ఇక అప్పటినుండి ఆమె కథల గురించే ఎక్కువుగా ఆలోచిస్తోందట. తానూ కథలు రాయడం మొదలుపెట్టినప్పటి నుండి మనసు ప్రశాంతగా ఉందని.. అందుకే షూటింగుల విరామంలో కూడా తన పెన్ కు పని కల్పిస్తూ ఉంటానని.. కాకపోతే ఈ ఏడాది జనవరిలో మొదలుపెట్టిన తన కొత్త కథ ఇంకా రాయడం పూర్తి కాలేదని, ప్రస్తుత కరోనా సమయాన్ని పూర్తిగా వాడుకొని ఆ కథను పూర్తి చేస్తానని నిత్యా తెలిపింది.
ఏది ఏమైనా నిత్యామీనన్ మంచి టాలెంట్ ఉన్న నటి. పైగా నిత్య ఒక భాషకు మాత్రమే పరిమితం అయిన హీరోయిన్ కూడా కాదు. ఆమెకు తెలుగు, తమిళ, మలయాళంతో పాటు హిందీ, కన్నడ చిత్ర సీమల్లో కూడా గుర్తింపు ఉంది. అయితే, ఒక్క భాషలో కూడా నిత్యా మీనన్ కి స్టార్ డమ్ రాకపోవచ్చు, కానీ ఆమెకు వివిధ భాషల్లో మంచి నటి అని ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది, అందుకే నిత్యకి ఎప్పుడూ అవకాశాలు ఉంటేనే ఉంటాయి.