ప్రతీ ఐపీఎల్ లో వరుస ఓటములతో చివరి స్థానంలో ఉండే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టోర్నమెంట్‌ను బాగా ప్రారంభించింది. ఈ ఎడిషన్‌లో బాగా రాణించటానికి కష్టపడుతున్నారు. గత మూడు మ్యాచ్ లలో జరిగిన రెండు ఓటములు వారిని కొంచెం ఆందోళనకు గురిచేశాయి. వారు ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడబోతున్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఇరు జట్లు ఈ రాత్రి తలపడతున్నాయి..
-ఆర్‌సీబీకి డెత్ బౌలింగ్ చింత
ఓడిపోయిన రెండు మ్యాచ్‌లలో ఆర్‌సిబికి డెత్ బౌలింగ్ ప్రధాన సమస్యగా మారింది. వారి కొత్త పేస్ అస్త్రం హర్షల్ పటేల్ చెన్నై నిదానమైన పిచ్‌లో బాగా రాణించాడు. కానీ అహ్మదాబాద్‌లో ఘోరంగా విఫలమవుతున్నాడు. కాబట్టి విరాట్ డెత్ ఓవర్ల కంటే మిడిల్ ఓవర్లలో అతన్ని తెలివిగా ఉపయోగించుకోవాలి. ఈ మ్యాచ్ లో సిరాజ్‌కు డెత్ ఓవర్లు ఇవ్వవచ్చు. విరాట్ కోహ్లీని మినహాయించి, ప్రతి ఇతర టాప్-ఆర్డర్ బ్యాట్స్ మాన్ ఆర్సీబికి బాగా రాణిస్తున్నాడు. వారు చివరి మ్యాచ్ ఆడిన జట్టును పునరావృతం చేయవచ్చు.
– గందరగోళంగా ఉన్న కేకేఆర్
సన్ రైజర్స్ హైదరాబాద్ మాదిరిగానే కోల్ కతా నైట్ రైటర్స్ కు కూడా మిడిల్ ఆర్డర్ ఈ ఎడిషన్‌లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాట్‌తో భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. దినేష్ కార్తీక్, ఆండ్రీ రస్సెల్.. షుబ్మన్ గిల్ వంటివారు చాలా అస్థిరంగా ఆడుతున్నారు. బ్యాటింగ్ బాధ్యత మొత్తం నితీష్ రానా, రాహుల్ త్రిపాఠిపై పడుతోంది. పాట్ కమ్మిన్స్‌ను మినహాయించి బౌలింగ్ ఫ్రంట్‌లో జట్టుకు ఎవరూ నిలకడగా రాణించడం లేదు. అహ్మదాబాద్ లోని గమ్మత్తైన పిచ్ లను పరిశీలిస్తే ఇది అధిక స్కోరింగ్ మ్యాచ్ అవుతుందా? లేక తక్కువ స్కోరింగ్ థ్రిల్లర్ అవుతుందా? అన్నది చెప్పకుండా ఉంది.
ఐపీఎల్ చరిత్ర: ఆర్‌సీబీ, కేకేఆర్ ఇప్పటివరకు 27 మ్యాచ్ లు ఆడారు. ఆర్‌సీబీ 13 విజయాలు సాధించగా, కేకేఆర్ 14 విజయాలతో పైచేయి సాధించింది. ఈ ఎడిషన్‌లో లీగ్ దశలో మొదటి మ్యాచ్ లో కెకెఆర్‌పై ఆర్‌సీబీ గెలిచింది.
మ్యాచ్ వేదిక: నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్.
మ్యాచ్ సమయం: సాయంత్రం 07.30 PM