మూడేళ్లలో బీజేపీ గెలుపోటములెంత?

రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కు ఏదీ కలిసి రావడం లేదు. కరోనా మహమ్మారి చుట్టుముట్టడం.. లాక్ డౌన్ విధించడంతో నానా కష్టాలు వచ్చిపడ్డాయి. వలస కార్మికుల వెతలు.. ప్రజలకు ఆదాయం కోల్పోవడం.. దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో ప్రజలకు ఏం విదిల్చలేని దీన స్థితిలోకి జారిపోయాయి. ఈ నేపథ్యంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ హవాను […]

Written By: NARESH, Updated On : May 3, 2021 9:22 am
Follow us on

రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ కు ఏదీ కలిసి రావడం లేదు. కరోనా మహమ్మారి చుట్టుముట్టడం.. లాక్ డౌన్ విధించడంతో నానా కష్టాలు వచ్చిపడ్డాయి. వలస కార్మికుల వెతలు.. ప్రజలకు ఆదాయం కోల్పోవడం.. దేశ, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో ప్రజలకు ఏం విదిల్చలేని దీన స్థితిలోకి జారిపోయాయి.

ఈ నేపథ్యంలోనే గత సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించిన బీజేపీ.. తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ హవాను కొనసాగించడంలో విఫలం అవుతూ వస్తోంది. కరోనా లాక్ డౌన్ విషయంలో మోడీ సర్కార్ వ్యవహారశైలితో ప్రజలంతా కూడా బీజేపీకి దూరంగా జరిగిన పరిస్థితి కనిపిస్తోంది.సార్వత్రిక ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభుత్వం తీరుతో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లిందా? అనే అనుమానం బీజేపీలో వ్యక్తమవుతోంది.

2019 లో ఎన్నికలు జరిగిన తర్వాత చూస్తే పరిస్థితులు బీజేపీకి వ్యతిరేకంగా మారాయని అర్థమవుతోంది.చ 2019 తర్వాత జరిగిన మొత్తం 14 రాష్ట్రాల ఎన్నికల్లో కేవలం 5 రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ అధికారంలోకి రాగలిగింది. 9 రాష్ట్రాల్లో ఓడిపోయింది. ముఖ్యమైన అంశం ఏంటంటే బీజేపీ అధికారంలో రెండు రాష్ట్రాలను కూడా కోల్పోయింది. కొత్తగా ఒక రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది.

ప్రస్తుతం బీజేపీ దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న చోట మూడింటిలో మాత్రమే బీజేపీ అభ్యర్థులు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. 2019లో లోక్ సభతోపాటు జరిగిన ఆంధ్రప్రదేవ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో మూడు చోట్లా ప్రాంతీయ పార్టీలే విజయం సాధించాయి. అదే సంవత్సరం జరిగిన అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మిత్రపక్షాలతో బీజేపీ ఘనవిజయం సాధించింది.

ఇక ఆ తర్వాత జరిగిన హర్యానా ఎన్నికల్లో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల అనంతరం జననాయక్ జనతాపార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఝార్ఖండ్ ఎన్నికల్లో ఓడిపోయింది. మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచినా శివసేన హ్యాండ్ ఇవ్వడంతో అధికారానికి బీజేపీ దూరమైంది.

2021లో తాజాగా జరిగిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీకి పెద్ద రాష్ట్రాలు దక్కలేదు. ఈ ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో అధికారం దక్కలేదు. అసోంలో మిత్రపక్షాలతో కలిసి రెండో సారి అధికారం సంపాదించింది. ఇక పుదుచ్చేరిలోనే ఎన్ఆర్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ఇలా రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన 14 రాష్ట్రాల ఎన్నికల్లో 9 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయింది. ఇక అధికారంలో ఉండి కూడా మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. బెంగాల్, కేరళ , తమిళనాడులో ఓడిపోయింది. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, అసోం, హర్యానా, పుదుచ్చేరిలో సొంతంగా కాకుండా మిత్రపక్షాలపై ఆధారపడి గెలిచింది.