Manchu Vishnu: కోలీవుడ్‌లో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న మంచు విష్ణు
Manchu Vishnu: ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ఢీ అంటే ఢీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన ఢీ సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. దీంతో పాటు మోహన్‌బాబు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020లోఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి ఢీ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి. మరోవైపు కురుళ్ 388 సినమాతో […]
Manchu Vishnu: ప్రముఖ టాలీవుడ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం ఢీ అంటే ఢీ సినిమాలో ఫుల్ బిజీగా ఉన్నారు. గతంలో వచ్చిన ఢీ సినిమాకు సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. దీంతో పాటు మోహన్‌బాబు నటిస్తున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాను తానే స్వయంగా నిర్మిస్తున్నారు. 2020లోఆయన నటించిన మోసగాళ్లు, చదరంగం చిత్రాలు విడుదల కాగా.. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. మరి ఢీ సినిమాతోనైనా హిట్ కొడతారేమో చూడాలి.
Manchu Vishnu
మరోవైపు కురుళ్ 388 సినమాతో ఈ తెలుగు స్టార్ కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టనున్నారు. మంచు విష్ణు హీరోగా కోలీవుడ్‌కు పరిచయం కానున్న సినిమా కురుళ్388. రామా రీల్స్ పతాకంపై జాన్ సుధీర్, కిరణ్ ధనబాలా సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. ఇందులో సురభి హీరోయిన్గా కనిపించనుండగా.. సంపత్‌కుమార్, నాజర్, మీశ్కాంత్, రామదాస్, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
జీఎస కార్తిక్ ఈ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని నిర్మాతులు తెలిపారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇటీవలే జరిగిన మా అధ్యక్ష ఎన్నికల్లో మంచు విష్ణు గెలుపొందిన సంగతి తెలిసిందే. ప్రకాశ్‌రాజ్ పోటీగా నలబడగా.. మంచు విష్ణు బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే మా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సర్దుమనిగినప్పటికీ.. లోపల మాత్రం ఇంకా లావాలా చెలరేగుతూనే ఉంది.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.