Akhanda and RRR: తెలుగు నాట..సినిమా వేరు రాజకీయం వేరు అని చెప్పలేం. మారిన సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులతో కొంత మార్పు వచ్చినప్పటికీ సినిమాలు రాజకీయంగా ప్రభావం చూపుతాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమాల ద్వారా ఎనలేని ఖ్యాతి గడించి ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చి సక్సెస్ అయిన సీనియర్ ఎన్టీఆర్ గురించి అందరికీ తెలుసు. ఆయన స్థాపించిన టీడీపీని ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్లారు. ఇప్పటికీ ఆయనే సీనియర్ ఎన్టీఆర్ అల్లుడిగా ఆ పార్టీని నడిపిస్తున్నారు. కాగా, సీనియర్ ఎన్టీఆర్ తనయుడు బాలయ్య, మనవడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు సదరు పార్టీ బలోపేతానికి, పుంజుకోవడానికి ఏ విధంగా సాయపడతాయనే విషయాలపై ఫోకస్..

నందమూరి వంశ హీరోలతో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం రాబోతున్నదనే అభిప్రాయం సినీ, రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఏపీలో ఒకనాడు అధికారంలో ఉన్న టీడీపీ నేడు విభజిత ఏపీలో ప్రతిపక్ష పాత్రకే పరిమితమైంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ అధినాయకత్వం పార్టీ కేడర్‌ను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలని పలువురు అంటున్నారు. అందుకు బాలయ్య, తారక్ సినిమాలు సాయపడతాయని చెప్తున్నారు. ఎలాగంటే..
టీడీపీ కేడర్‌గా ఉన్న ప్రజలందరూ దాదాపుగా సీనియర్ ఎన్టీఆర్ ఆయన కుటుంబ సభ్యుల అభిమానులు. ఈ క్రమంలోనే బాలయ్య ‘అఖండ’ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇక ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ డెఫినెట్‌గా సక్సెస్ అవుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నందమూరి వంశం ద్వారా టీడీపీకి పూర్వ వైభవం వస్తుందనే టాక్ వినబడుతోంది. ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్స్ అవడంతో నందమూరి అభిమానులు ఆనందంలో ఉంటారు. అలా వారు మళ్లీ టీడీపీకి సోల్జర్స్ మాదిరిగా పని చేసే అవకాశముందని చెప్తున్నారు.
Also Read: మీడియాపై పంచ్‌లు పేల్చిన రాజమౌళి
టీడీపీలోనూ నందమూరి హీరోలపై పాపులారిటీ మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. నిజానికి టీడీపీలో చంద్రబాబు తర్వాత వారసుడిగా లోకేశ్ రావాలని ఆయన ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో ఆయన్ను ప్రత్యక్ష ఎన్నికల్లోకి దించాడు. అయితే, లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలుకావడం ఆ తర్వాత పార్టీ పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా మారడం జరిగింది. ఈ క్రమంలోనే పార్టీలో నూతనోత్తేజం నింపేందుకు బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఉపయోగపడతాయనే వాదన వినబడుతోంది.
బాలయ్య ఇప్పటికే టీడీపీలో కీలక నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ సైతం తన తాత స్థాపించిన టీడీపీని గౌరవిస్తానని, ఎప్పటికీ అందులోనే ఉంటానని గతంలో తెలిపాడు. అలా సీనియర్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, బాలయ్యల ద్వారా టీడీపీకి అభిమానులు మరింత పుంజుకునే చాన్సెస్ ఉంటాయని పరిశీలకులు అంటున్నారు.
Also Read: బాలయ్య స్టామినా అదే.. అలా మరెవరూ చేయలేరు..