Manchu Vishnu: మన అందరికి తెలిసిందే..చాలా కాలం నుండి మంచు కుటుంబం లో ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నాయి అనేది. క్రమశిక్షణ కి మారుపేరు గా చెప్పుకునే మోహన్ బాబు కుటుంబ సమస్యలు రోడ్డు మీదకు వచ్చాయి. ఏళ్ళ తరబడి ఆయన కాపాడుకుంటూ వచ్చిన గౌరవం మొత్తం మంటకలిసింది. అందుకే ఆయన మనోజ్ ని పూర్తిగా తన కుటుంబం నుండే వెలివేసాడు. ఇప్పుడు మనోజ్(Manchu Manoj) తన భార్య, పిల్లలతో కలిసి సెపరేట్ కాపురం మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ గొడవ మొత్తం మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్యనే జరిగింది. బయటకు వచ్చి ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయికి చేరుకుంది. మోహన్ బాబు విష్ణు(Manchu Vishnu) వైపు నిల్చున్నాడు. అయితే ‘కన్నప్ప’ మూవీ రిలీజ్ సమయం లో మంచు మనోజ్ మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా, థియేటర్ కి వెళ్లి, సినిమాని చూసి, పాజిటివ్ రివ్యూ ని కూడా ఇచ్చాడు.
ఇకపోతే నేడు మంచు మనోజ్ విలన్ క్యారక్టర్ చేసిన ‘మిరాయ్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది. ఈ సందర్భంగా మనోజ్ పోషించిన క్యారక్టర్ పై సోషల్ మీడియా లో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. చాలా కాలం తర్వాత బలమైన క్యారక్టర్ తో మంచు మనోజ్ మన ముందుకొచ్చాడని, ఇదే ఆయన అసలు సిసలు బలం అని పొగడ్తలతో ముంచి ఎత్తారు ప్రేక్షకులు. సోషల్ మీడియా లో వచ్చిన ఈ రెస్పాన్స్ ని చూసి మంచు విష్ణు ట్విట్టర్ లో మిరాయ్ టీం కి శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ట్వీట్ వేసాడు. అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనికి మంచు మనోజ్ రిప్లై ఇస్తాడో లేదో అని అనుకున్నారు. కానీ ఆయన విష్ణు ట్వీట్ ని క్వాట్ చేస్తూ థాంక్యూ అన్నా అని అంటాడు. ఈ ట్వీట్ కూడా బాగా వైరల్ అయ్యింది. అన్నదమ్ముల మధ్య ఎన్నైనా ఉంటాయి, ఎంతైనా మీ రక్త సంబంధం మిమ్మల్ని వేరు చేయలేదు, గొడవలన్నీ మర్చిపోయి మళ్లీ కలిసి ఉండండి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. మరి మంచు కుటుంబం భవిష్యత్తులో అయినా కలుస్తుందా లేదా అనేది చూడాలి.