Tillu Square Review: ‘డీజే టిల్లు 2’ ఫుల్ మూవీ రివ్యూ

డీజే టిల్లు కి సీక్వెల్ గా మరొక సినిమాని చేయాలని ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? డీజే టిల్లు ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో, అదేవిధంగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By: Gopi, Updated On : March 29, 2024 9:11 am

Tillu Square Review

Follow us on

Tillu Square Review: డీజే టిల్లు సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న సిద్దు జొన్నలగడ్డ…ఆ సినిమా ఇచ్చిన స్టార్ ఇమేజ్ తో వరుస సినిమాలకు సైన్ చేసి ముందుకు కదులుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే డీజే టిల్లు కి సీక్వెల్ గా మరొక సినిమాని చేయాలని ప్రయత్నం చేశాడు. ఇక అందులో భాగంగానే ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉంది? డీజే టిల్లు ఎలాంటి సక్సెస్ అయితే సాధించిందో, అదేవిధంగా ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిందా? లేదా అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

కథ

ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే టిల్లు కి ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తూ ఉంటారు.ఇక దానికి టిల్లు మాత్రం నేను ఎవరిని పెళ్లి చేసుకోను నేను ఇలాగే సోలోగా నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమం లోనే ఒకరోజు పబ్ లో అతనికి లిల్లీ (అనుపమ పరమేశ్వరన్) కలుస్తుంది. లిల్లీ తో ప్రేమలో పడిన సిద్దు ఆమె కోసం మాఫియాతో పోరాడాల్సి వస్తుంది. టిల్లు మొదటి పార్ట్ లో ఎలాగైతే రాధిక తనని మోసం చేసి వెళ్ళిపోయిందో లిల్లీ కూడా అలాగే టిల్లుని మోసం చేసి వెళ్ళిపోతుందా లేదా అనే ఆసక్తిని గొలిపే అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే చివర్లో లిల్లీ టిల్లు ను వదిలేస్తుందా లేదా పెళ్లి చేసుకుంటుందా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

విశ్లేషణ

ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాని చాలా పర్ఫెక్ట్ గా తెరకెక్కించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఈ సినిమాలో కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నప్పటికీ అవి మరి పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించేవి కావు. కాబట్టి ప్రేక్షకులందరు ఏ ఇబ్బంది లేకుండా ఈ సినిమానైతే చూడొచ్చు. ఇక ప్రతి సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా ముందుకు వెళ్తున్న సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాతో మరోసారి తన మార్క్ ఆఫ్ టేస్ట్ ఎలా ఉంటుందో చూపిస్తూ ఈ సినిమాని తీశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో మరోసారి తన మ్యాజిక్ ని క్రియేట్ చేసే పనైతే చేశాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ అఫ్ మొత్తాన్ని ఎంటర్ టైనింగ్ గా తీసుకెళ్లాడు. అలాగే సెకండ్ హాఫ్ లో కూడా అదే ఎంటర్ టైన్ మెంట్ కంటిన్యూ చేసినప్పటికి చివరలో కొంత ఎమోషనల్ సీన్స్ అనేది యాడ్ చేయడం సినిమాకి మరింత బూస్టప్ అయితే ఇచ్చింది.

ఇక మొదటి పార్ట్ ఎలాగైతే నవ్వులు పువ్వులు కురిపిస్తుందో ఈ సినిమా కూడా అలాగే ముందుకు సాగుతూ ప్రేక్షకులను గిలిగింతలు పెడుతూనే సిద్దు జొన్నలుగడ్డ చెప్పే డైలాగులకి ప్రేక్షకులు విపరీతంగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మొత్తానికైతే ఈ సినిమా సిద్దుకి ఒక మంచి విజయాన్ని అందించిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఆద్యంతం బాగున్నప్పటికీ కొన్ని సీన్స్ లో లాజిక్స్ మిస్ అయ్యాయి. అది కూడా క్లారిటీ గా చూసుకొని ఉంటే బాగుండేది. ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే దర్శకుడు రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే సీన్స్ గాని, ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ గాని ప్రేక్షకులను నిజంగా కట్టిపడేస్తుందనే చెప్పాలి. ఇక టిల్లు మొదటి పార్ట్ లో ఎలాగైతే కోర్టు సీన్ హైలైట్ గా నిలిచిందో ఇక్కడ కూడా ఒక రెండు, మూడు ఎపిసోడ్లు హైలెట్ గా నిలిచాయనే చెప్పాలి. ఇక ఈ సినిమా కి అనుపమ పరమేశ్వరన్ మరో అట్రాక్షన్ గా నిలిచింది. ఇక మొదటి పార్ట్ లో నేహా శర్మ ఎలాగైతే ఆ సినిమాను తన అంద చందాలతో సక్సెస్ ఫుల్ గా నిలిపిందో, ఇప్పుడు కూడా అనుపమ పరమేశ్వరన్ కూడా అదేవిధంగా ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేయడంలో కీలకపాత్ర వహించిందనే చెప్పాలి. ఇక సిద్దు అనుపమ ల మధ్య వచ్చే కొన్ని సీన్లు అయితే కామెడీని పంచుతూనే ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్ టైన్ చేశాయి.

ఇక ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ ఫాదర్ క్యారెక్టర్ లో నటించిన మురళి అనే నటుడు కూడా చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ను ఇస్తు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన కొన్ని డైలాగులు అయితే ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వించడమే కాకుండా థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ డైలాగులు గుర్తొస్తూ ఉంటాయి… ఇక ఈ సినిమాకి రామ్ మిరియాల అందించిన మ్యూజిక్ కూడా చాలావరకు ప్లస్ అయిందనే చెప్పాలి. ఇక మొదటి పార్ట్ లో ఎలాగైతే మ్యూజిక్ ఆ సినిమా సక్సెస్ కీలక పాత్ర వహించాయి. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అంత బాగా లేనప్పటికీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే కొంతవరకు ఓకే అనిపించింది…

ఆర్టిస్టుల పర్ఫామెన్స్

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే సిద్దు జొన్నలగడ్డ వన్ మ్యాన్ షో చేశాడనే చెప్పాలి. మొదటి పార్ట్ లో ఎలాగైతే తనని తాను డీగ్రేడ్ చేసుకుంటూ కామెడీని పండించాడో ఈ సినిమాలో అంతకుమించి కామెడీని వర్కౌట్ చేశాడు. ముఖ్యంగా ఆయన చెప్పిన డైలాగ్ డెలివరీ గాని, ఆయన చూపించిన నటన గాని నెక్స్ట్ లెవెల్లో నిలిచాయనే చెప్పాలి. అందుకే సిద్దు జొన్నలగడ్డ లాంటి నటుడు ఇండస్ట్రీలో ఉండటం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. తనకంటూ ఒక సపరేట్ మేనరిజంతో చాలా ఈజీగా డైలాగులను చెబుతూ తనకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమా కోసం తను చాలా కష్టపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపు రెండు సంవత్సరాల నుంచి ఇదే సినిమా మీద కసరత్తులు చేస్తూ మొత్తానికైతే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక అనుపమ పరమేశ్వరన్ అటు గ్లామర్ షో చేస్తూనే నటన పరంగా కూడా చాలా సెటిల్డ్ గా నటించింది. ఎక్కడ కూడా ఓవరాక్షన్ అనిపించకుండా తనకున్న పరిధిని దాటకుండా నటిస్తూ ప్రేక్షకులను కట్టిపడేసింది.

మొదటి పార్ట్ లో నేహా శర్మ ఎలాగైతే నటించిందో సెకండ్ పార్ట్ లో అనుపమ కూడా తనకు ఏమాత్రం తీసిపోకుండా చాలా మంచి నటనను కనబర్చింది. కొన్ని సీన్లలో కన్నింగ్ యాక్టింగ్ ను కూడా చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేసింది… మిగతా ఆర్టిస్టులందరూ కూడా వాళ్ళ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.

టెక్నికల్ అంశాలు

టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ ప్లస్ అయిందనే చెప్పాలి.. అలాగే విజువల్స్ కూడా ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో చూపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికొస్తే సితార ఎంటర్ టైన్ మెంట్ మీద తెరకెక్కిన ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా నాగవంశీ వ్యవహరించాడు. చిన్న సినిమా అని ఆయన ఏమాత్రం ఆలోచించకుండా ఈయన భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తుంది…

ప్లస్ పాయింట్స్

సిద్దు జొన్నలగడ్డ యాక్టింగ్
కొన్ని కామెడీ సీన్లు
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్

మ్యూజిక్
లాజిక్ లేని కొన్ని సీన్లు…

ఇక మొత్తానికి అయితే ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.75/5

చివరి లైన్
లాజిక్స్ తో సంబంధం లేకుండా ఒక 2 గంటల పాటు ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఈ సినిమా చూడవచ్చు…