Satyabhama Movie Review: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వైవిధ్యమైన కథాంశాలు వస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ విజయాలను అందుకుంటున్నాయి. ఇక గత వారం నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాల సందడి చాలా ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది. ఇక ఇంతకు ముందు థియేటర్ల దగ్గర ప్రేక్షకులు ఎవరు ఉండేవారు కాదు కానీ ప్రస్తుతం సినిమాల సందడి మొదలవ్వడంతో ప్రతి ప్రేక్షకుడు కూడా వీకెండ్ లో తమ ఫ్యామిలీతో సినిమాలు చూడడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక అందులో భాగంగానే ఈ వారం కూడా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్ లో నటించిన సత్యభామ సినిమా ఒకటి. ఇక ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు అయిన శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరించగా, సుమన్ చిక్కాల ఈ సినిమాకు డైరెక్షన్ చేశాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమా ఎలా ఉంది. కాజల్ అగర్వాల్ లీడ్ రోల్లో నటించి మెప్పించి ఈ సినిమాను సక్సెస్ దిశగా ముందుకు తీసుకెళ్లిందా? లేదా? అనే విషయాన్ని మనం ఒకసారి డీప్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీం కి ఏసీబీ స్థాయిలో పనిచేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె ఎప్పుడూ చాలా కామ్ గా ఉంటూనే నేరస్తుల దగ్గర నుంచి నిజాలను ఎలా రప్పించాలి అనేది మాత్రం చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వాళ్ల చేత నిజాలను కక్కిస్తూ ఉంటుంది. ఇక ఆడవాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని వాళ్ల పట్ల చాలా ఎక్కువ కేర్ తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక ఇదే క్రమం లో రచయిత అయిన అమరేందర్ (నవీన్ చంద్ర) ను పెళ్లి చేసుకుంటుంది. ఇక ఆమె తను వ్యక్తిగత జీవితం కంటే కూడా తన డ్యూటీ కి ఎక్కువ ప్రాధాన్యత ను ఇస్తు ముందుకు సాగుతుంది. ఇక ఇదిలా ఉంటే ఒకరోజు హసీనా అనే ఆవిడ తన భర్త తనని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అని సత్యభామ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది.
దాంతో సత్యభామ నీకేం భయం లేదు నేను ఉన్నాను అని తనకి ధైర్యం చెప్పి తనను ఇంటికి పంపిస్తుంది. ఇక హసీనా భర్త తనను హత్య చేస్తాడు. ఇక ఈ హత్యని చూసి చలించి పోయిన సత్యభామ అతన్ని పట్టుకోడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తుంది. హసీనా మరణం వెనక సత్యభామ అంత వైల్డ్ గా రెస్పాండ్ అవ్వడానికి కారణం ఏంటి? హసీనాకు సత్యభామకు మధ్య ఇంతకుముందే ఫ్రెండ్షిప్ ఏదైనా ఉందా? అనే అంశాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సుమన్ చిక్కాల రాసుకున్న కథ లో పెద్దగా కొత్తదనం ఏమీ లేకపోయినా కూడా కథనంలో ఆయన అనుసరించిన విధానం అయితే కొద్ది వరకు పర్లేదు అనిపిస్తుంది. ఇక సత్యభామ క్యారెక్టర్ ను చాలా వైల్డ్ గా ఎస్టాబ్లిష్ చేస్తూనే ఆమె ఎలాంటి కరుడుగట్టిన నేరస్తులనైనా ఈజీగా పట్టుకోగలదు అంటూ పరిచయం చేస్తారు. కానీ సినిమా నడుస్తున్న కొద్ది ఆ పాత్రలో ఉన్న క్యారెక్టరైజేశన్ అనేది చాలావరకు పక్కదారి పడుతూ వస్తుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ ఎలా ఉంటుందని సినిమాలో ఎస్టాబ్లిష్ చేశారో అలాంటి క్యారెక్టర్ ని కాకుండా ఇంకో రకమైన క్యారెక్టర్ ని పోషించాల్సి ఉంటుంది. దానివల్ల ఆమె పాత్రతో ప్రేక్షకుడు ట్రావెల్ అవ్వలేకపోతాడు.
ముఖ్యంగా క్యారెక్టర్జేషన్ లో బలమైన రైటింగ్ లేకపోవడం వల్లే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి…ఇక సినిమా స్క్రీన్ ప్లే పరంగా పర్లేదు అనిపించిన కూడా అక్కడక్కడ కొన్ని మిస్టేక్స్ అయితే చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్ జానర్లో సినిమాని తెరకెక్కించినప్పుడు సినిమా అనేది చాలా ఫాస్ట్ గా ముందుకు మూవ్ అవుతూ ఉండాలి. కేసు కు సంభందించిన ఒక్కొక్క క్లూ పాయింట్ దొరికినప్పుడు ప్రేక్షకుడు చాలా ఎక్సైట్ అవుతూ ఉండాలి. అలాంటప్పుడే సినిమా అనేది ప్రేక్షకుడిని చాలావరకు ఎంగేజ్ చేయగలుగుతుంది. కానీ ఈ సినిమాలో అలాంటివి మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇక అలాగే సినిమా ఒక మూడ్ లో వెళుతున్నప్పుడు ఆ హంతకున్ని పట్టుకోవాలి అనే విషయాన్ని పక్కన బెట్టి అమ్మాయిల అక్రమ రవాణా లాంటివి తెర మీదకి తీసుకొచ్చాడు. ఇక మెయిన్ పాయింట్ పక్కన పెట్టేసి సబ్ ప్లాట్ మీద ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా అనిపిస్తుంది. అలాగే విలన్ ఎవరో ఆడియన్స్ కి ముందుగానే చెప్పేశారు. కాబట్టి అతన్ని పట్టుకోవడానికి కాజల్ అగర్వాల్ ఎలాంటి స్కెచ్ వేస్తూ ముందుకు సాగింది అనేది కూడా అంత ఆసక్తికరంగా చూపించలేదు. ఇక కాజల్ అగర్వాల్ క్లూస్ ని సంపాదించడం కోసం ఎంచుకున్న విధానం కూడా అంత కన్విన్సింగ్ గా అనిపించదు.
ఇక సినిమాల్లో వచ్చే కొన్ని ట్విస్ట్ లు మాత్రం ప్రేక్షకుడిని కొంత రిలీఫ్ కు గురిచేస్తాయి. ఇక మొత్తానికైతే ఈ సినిమా విషయంలో దర్శకుడు ఏదైతే రాసుకున్నాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో చాలావరకు తడబడ్డాడనే చెప్పాలి… ఇక ఈ సినిమాలో ఉన్న ప్లాట్ పాయింట్ అనేది ఎంగేజింగ్ గా ఉన్నప్పటికీ దాని చుట్టూ రాసుకున్న ట్రీట్ మెంట్ మాత్రం అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ కూడా అంత పెద్దగా ప్లస్ అయితే అవ్వలేదు…ఇక మొత్తానికైతే ఈ సినిమాకి ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే లీడ్ రోల్ లో నటించిన కాజల్ అగర్వాల్ తనదైన రీతిలో నటించి మెప్పించింది. ఇక ఇప్పటివరకు తను అలాంటి పాత్రను పోషించలేదు. కాబట్టి ఆ పాత్రను చాలెంజింగ్ గా తీసుకొని నటించి మెప్పించడమే కాకుండా ఇక మీదట తను ఇలాంటి క్యారెక్టర్లు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని దర్శక నిర్మాతలకు ఒక సవాలైతే విసిరింది. ఇక కాజల్ అగర్వాల్ భర్తగా నటించిన నవీన్ చంద్ర క్యారెక్టర్ కి పెద్దగా స్కోప్ అయితే లేదు. ఇక ఉన్న దాంట్లోనే ఆయన ఓకే అనిపించేలా పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు. ఇక ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, రవి వర్మ లాంటి నటులు ఉన్నప్పటికీ వాళ్ళు పర్ఫామెన్స్ పరంగా అంత పీక్ స్టేజ్ లో అయితే చేయలేదు. రాసుకున్న క్యారెక్టర్లు కూడా చాలా బలహీనంగా ఉండడం వల్లే వాళ్ళ పాత్రలు ఎలివేట్ అవ్వలేదనేది వాస్తవం…ఇక మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ల పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించే ప్రయత్నం చేశారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సాయి చరణ్ పాకాల అందించిన మ్యూజిక్ పెద్దగా ఎఫెక్ట్ అయితే చూపించలేదు. ఇక విష్ణు బిసి సినిమాటోగ్రఫీ పర్లేదు అనిపించేలా ఉంది. కొన్ని షాట్స్ ని చాలా బాగా డిజైన్ చేసినప్పటికీ సినిమా తాలూకు మూడ్ ను క్రియేట్ చేయడంలో తను కొంతవరకు సక్సెస్ అయితే సాధించాడు…
ప్లస్ పాయింట్స్
కాజల్ అగర్వాల్ యాక్టింగ్…
సినిమాలో ఉన్న కొన్ని ట్విస్ట్ లు…
మైనస్ పాయింట్స్
రోటీన్ కథ, స్క్రీన్ ప్లే…
కొన్ని బోర్ కొట్టించే సీన్స్…
రేటింగ్
ఇక ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.25/5
చివరి లైన్
థ్రిల్లింగ్ అంశాలు లేక రోటీన్ గా సాగిన సత్యభామ…