Gold Rates Today: బంగారం కొనుగోలుదారులకు భారీ షాక్..

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు తగ్గిన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలు దారులు షాక్ తింటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : June 7, 2024 9:04 am

Gold Rates In Holy

Follow us on

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు తగ్గిన ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో కొనుగోలు దారులు షాక్ తింటున్నారు. దేశీయంగా గురువారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

బులియన్ మార్కెట్ ప్రకారం.. జూన్ 7న ఓవరాల్ గా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,300గా నమోదైంది. 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.73,400 గా ఉంది. జూన్ 6న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.66,600తో విక్రయించారు. 10 గ్రాముల బంగారానికి గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.700 పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,460 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.73,580గా నమోదైంది.ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.67,300 కొనసాగుతోంది. 24 క్యారెట్లు రూ.73,430 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.68,010 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.74,190తో విక్రయిస్తున్నారు. బెంగుళూరులో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.67,300 పలుకుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,430తో విక్రయిస్తున్నారు. హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.67,300తో విక్రయిస్తున్నారు. 24 క్యారెట్ల 10 గ్రాములకు రూ.73,430తో విక్రయిస్తున్నారు.

బంగారం ధరలతో పాటు వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం ఓవరాల్ గా కిలో వెండి రూ.93,600గా నమోదైంది. గురువారంతో పోలిస్తే శుక్రవారం రూ.2000 మేర తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం న్యూ ఢిల్లీలో కిలో వెండి రూ.93,600గా ఉంది. ముంబైలో రూ.93,600, చెన్నైలో రూ.98,100 బెంగుళూరులో 90,100, హైదరాబాద్ లో రూ. 98,100 తో విక్రయిస్తున్నారు.