TTD Ghee Scam Andhra Pradesh: ఏపీ ( Andhra Pradesh) శాసనమండలిలో టిటిడి నెయ్యి కల్తీ వ్యవహారం ప్రతిరోజు దుమారానికి దారితీస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. శాసనసభలో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కకపోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదు. శాసనమండలిలో మాత్రం స్పష్టమైన బలం ఉండడంతో వైసిపి సభ్యులు హాజరవుతున్నారు. ఈ క్రమంలో సభ ప్రారంభమైన నాటి నుంచి నెయ్యి కల్తీ వ్యవహారం చర్చకు దారితీస్తూనే ఉంది. మూడు రోజుల కిందట నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చకు అనుమతి ఇచ్చారు శాసనమండలి చైర్మన్. ఈ క్రమంలో చర్చలు వాడి వేడిగా సాగుతున్నాయి. ఒకానొక దశలో మతపరమైన ఆరోపణలకు దారితీసాయి. దీనిపై శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.
Also Read: జనాభా పెంచండి.. ఏపీ ప్రజలకు చంద్రబాబు గొప్ప ఆఫర్
* అప్పటి నుంచి రచ్చ
నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం( special investigation team) .. కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది. నెయ్యి కల్తీ వ్యవహారంపై కొంత స్పష్టతనిచ్చింది. కల్తీ జరిగిందని కూడా చెప్పుకొచ్చింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హెరిటేజ్ సంస్థను తెరపైకి తెచ్చింది. అనేక రకాల అంశాలను మండలిలో ప్రస్తావించి చర్చించాలని డిమాండ్ చేసింది. చైర్మన్ మోషన్ రాజు అవకాశం ఇవ్వడంతో చర్చ ప్రారంభం అయింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ముందస్తుగానే అప్రమత్తమయింది. పూర్తి ఆధారాలతో కూడిన 20 పేజీల ఒక నివేదికను శాసనమండలిలో ఉంచింది. సభ్యులందరికీ వాటిని అందించింది. ఈ క్రమంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై చర్చ మొదలైన తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉండే స్వతంత్ర ఎమ్మెల్సీ పర్వత చంద్రశేఖర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నేరుగా సీఎం చంద్రబాబుపై ఆరోపించారు. హెరిటేజ్ సంస్థను మరోసారి తెరపైకి తెచ్చారు. దీనిపై మంత్రులు గట్టిగానే సమాధానం చెప్పారు.
* విరుచుకుపడిన లోకేష్..
మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) స్పందిస్తూ వైసిపి సభ్యుల తీరుపై విరుచుకుపడ్డారు. తమ కుటుంబం ఎన్నడు తిరుపతి దేవస్థానం తో వ్యాపారాలు చేయలేదంటూ తేల్చి చెప్పారు. తన కుమారుడు ప్రతి పుట్టినరోజుకు స్వామివారి అన్నదానానికి భారీగా విరాళం అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి హెరిటేజ్ ఎటువంటి ఉత్పత్తులు చేయలేదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తప్పుడు మాటలు ఆడుతున్నారు అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు. తాను ఒంటరిగానే వైసీపీ సభ్యులకు గట్టిగానే సమాధానం చెప్పారు. అయితే పదే పదే వైసీపీ సభ్యులు.. అదే పనిగా హెరిటేజ్ ప్రస్తావన తీసుకొచ్చారు.
* మంత్రి క్షమాపణ..
మరోవైపు మంత్రి కింజరాపు అచ్చెనాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాయకుడికి హిందూ సమాజం పట్ల, టీటీడీ పట్ల అస్సలు మంచి భావన లేదని విమర్శించారు. ఆయన అన్య మతస్థుడు అంటూ పేర్కొన్నారు. వైసీపీ సభ్యులకు చైర్మన్ మోసేన్ రాజు అవకాశం ఇస్తున్నారంటూ ఆరోపిస్తూ.. ఆగ్రహానికి గురయ్యారు. చైర్మన్ మోసేన్ రాజు సైతం క్రిస్టియన్ అంటూ పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను క్రిస్టియన్ కాదని.. హిందువునని పేర్కొన్నారు. దీంతో వెంటనే స్పందించారు మంత్రి కింజరాపు అచ్చెనాయుడు. తన మాటలను వెనక్కి తీసుకుంటానని.. మీరు క్రిస్టియన్ అనుకున్నాను అంటూ చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరారు. ఇలా టిటిడి నెయ్యి కల్తీ వ్యవహారం.. మతాల వరకు వెళ్లి మరింత వివాదాస్పదం అయ్యింది.