https://oktelugu.com/

Darling Movie Review: ప్రియదర్శి ‘డార్లింగ్ ‘ ఫుల్ మూవీ రివ్యూ…

బలగం సినిమా నుంచి ప్రియదర్శి కి చాలా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు కూడా 'డార్లింగ్ ' అనే సినిమా తో మరోసారి హీరోగా తన లక్కును పరీక్షించుకోవడానికి మన ముందుకు వచ్చాడు... అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Written By:
  • Gopi
  • , Updated On : July 19, 2024 / 01:17 PM IST

    Darling Movie Review

    Follow us on

    Darling Movie Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి కథలను ఎంచుకొని కొంతమంది కమెడియన్లు సైతం హీరోలుగా మారి సినిమాలు చేస్తూ వాళ్లకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే నటుడు ‘ప్రియదర్శి ‘ కూడా చాలా వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ నటుడిగా ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటున్నాడు. ముఖ్యంగా బలగం సినిమా నుంచి ప్రియదర్శి కి చాలా మంచి క్రేజ్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు కూడా ‘డార్లింగ్ ‘ అనే సినిమా తో మరోసారి హీరోగా తన లక్కును పరీక్షించుకోవడానికి మన ముందుకు వచ్చాడు… అయితే ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే రాఘవ్ (ప్రియదర్శి) ఒక ట్రావెల్ ఏజెంట్..ఈయన తన కెరియర్ లో ఏది ఎలా జరిగిన కూడా వాటితో సంబంధం లేకుండా ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని హనీమూన్ కోసం ఫారన్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయాలనే మైండ్ సెట్ తో ఉంటాడు…ఇక ఆయన కెరియర్ సాఫీగా సాగుతున్న క్రమంలో అనుకోని కారణాల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. ఇక దాని నుంచి అతన్ని అనంది (నభా నటేష్) కాపాడుతుంది.ఇక ఇలాంటి గడ్డు పరిస్థితుల నుంచి బయటపడి ఆయన ఎట్టకేలకు పెళ్లి చేసుకుంటాడు..ఇక ఆ తర్వాత ఆయన లైఫ్ ఎలా ఉంది ముందుగా ఆయన ఊహించినట్టే ఉందా? లేదంటే పెళ్ళాం పోరు హో సాగుతుందా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా కోసం దర్శకుడు ఎంచుకున్న కథ చాలా బాగుంది. నిజంగా ఈ కథ తో ఆయన సినిమా చేయాలనుకోవడం లో తప్పు లేదు.. కానీ కథ మాత్రమే బాగుంది. దాని ఎగ్జిక్యూషన్ అంత పర్ఫెక్ట్ గా లేదు.. ఇక సీన్ల ట్రీట్ మెంట్ అయితే చాలా దారుణంగా రాసుకున్నారు. అసలు కామెడీ అని చెప్పి ఏది పడితే అది రాసుకొని సినిమా గా తీస్తే జనాలు ఎలా ఆక్సప్ట్ చేస్తారు. దర్శకుడు అశ్విన్ రామ్ కథ ను జెన్యూన్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ కథలోని సీన్స్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అసలు ప్రేక్షకుడిని ఎక్కడ ఎంగెంజ్ చేయలేని పరిస్థితి లో ఈ సినిమా ఉంది…కొన్ని సీన్లు అయితే ఎందుకు రాసారో అర్థం కాదు…

    ప్రియదర్శి, నభా నటేష్ లాంటి పాపులర్ ఆర్టిస్టులను పెట్టుకొని కూడా ఇంత డ్రాగ్ స్క్రీన్ ప్లే రాసుకోవడం ఒకటైతే దాన్ని స్క్రీన్ మీద అసలు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ప్రెజెంట్ చేశారు…ఒక సినిమా తీస్తున్నప్పుడు కనీసం దాని పర్పస్ ఏంటి అనేది ఆలోచించాలి. అలాగే సినిమా షూట్ చేస్తున్న క్రమం లోనే ఈ సినిమా ఎలా వస్తుంది. మనం అనుకున్న కాన్సెప్ట్ సరిగ్గా రిచ్ అయ్యే విధంగా వస్తుందా లేదా అనేది ఒకటికి పది సార్లు చెక్ చేసుకోవాలి… అలాంటప్పుడే సినిమాలో ఏ మిస్టేక్ ఉంది. దానికోసం మనం ఏం చెయ్యాలి అనే విధంగా ఆలోచిస్తూ ముందుకు సాగాలి. అంతే కానీ ఈ సినిమా లో అసలు కొన్ని క్యారెక్టర్స్ అయితే ఎందుకు వస్తున్నాయో ఎందుకు వెళ్తున్నాయో కూడా క్లారిటీ లేదు…

    ఆర్టిస్టుల పర్ఫామెన్స్

    ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి ఎప్పటిలాగే ఈ సినిమా లో తన యాక్టింగ్ తో ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. కానీ సీన్లల్లో దమ్ము లేనప్పుడు ఆర్టిస్ట్ మాత్రం ఏం చేస్తాడు…ఇక్కడ ప్రియదర్శి పరిస్థితి కూడా అలానే తయారైంది…ఇక చాలా రోజుల తర్వాత మళ్ళీ స్లివర్ స్క్రీన్ మీద కనిపించిన నభా నటేశ్ మరోసారి తన అంద చందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ఇక మొత్తానికైతే ఆమె పాత్రకి పర్ఫామెన్స్ చేసే స్కోప్ ఉన్నప్పటికీ పూర్ రైటింగ్ వల్ల ఆమె పాత్రకి ఒక జస్టిఫికేషన్ లేకుండా చేశారు…ఇక మిగిలిన ఆర్టిస్టులు అయిన అనన్య నాగళ్ళ కనిపించినంత సేపు తన నటనతో కొంతవరకు మ్యాజిక్ అయితే చేసింది. ఇక బ్రహ్మానందం, రఘుబాబు,మురళీధర్ గౌడ్, విష్ణు ఓఐ, కృష్ణ తేజ లాంటి నటులు వాళ్ల పాత్రల పరిధి మేరకు ఒకే అనిపించినప్పటికీ వాళ్ల నుంచి పూర్తి పర్ఫామెన్స్ ను రాబట్టుకోవడం లో మాత్రం దర్శకుడు ఫెయిల్ అయ్యాడు…

    టెక్నికల్ అంశాలు

    ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి వివేక్ సాగర్ ఇచ్చిన మ్యూజిక్ చాలా వరకు మైనస్ అయింది. అసలు ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు. ఇక నేపథ్య సంగీతం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. అలాగే ఈ సినిమా కి విజువల్స్ ఒకే అనిపించినప్పటికీ సీన్లలో ఫ్రెష్ నెస్ రావడానికి ఇంకా కొన్ని కెమెరా యంగిల్స్ వాడి ఉంటే బాగుండేది. ఇక ఇదిలా ఉంటే ఎడిటర్ మాత్రం ఈ సినిమాలో చాలా సీన్లను కట్ చేసి ఉండాల్సింది. నిజానికి ప్రియదర్శి తన భార్య తో గొడవపడే సీన్లు పదే పదే చూపిస్తూ ఉంటారు. అవి ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతాయి. అలాంటి సీన్లని ఎడిటింగ్ టేబుల్ మీదనే కట్ చేసి ఉంటే బాగుండేది…ఇక ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి పెట్టిన డబ్బులు ప్రతి సీన్ లో కనిపిస్తూ ఉంటాయి.. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

    ప్లస్ పాయింట్స్

    కథ లైన్ బాగుంది…
    ప్రియదర్శి యాక్టింగ్…

    మైనస్ పాయింట్స్

    కథ విస్తరణ సరిగ లేదు…
    చాలా సీన్లు ఈ సినిమాకి మైనస్ అయ్యాయి…
    అర్థం లేని కామెడీ…
    బొరింగ్ సీన్లు…
    డైరెక్షన్…

    రేటింగ్
    ఇక ఈ సినిమాకు మేమిచ్చే రేటింగ్ 1.5/5

    చివరి లైన్
    ప్రియదర్శి వరుస హిట్లకి బ్రేక్ పడింది…