Chile : చిలీ–అర్జెంటీనా సరిహద్దులో గురువారం రాత్రి భారీ భూకంపం ఏర్పడింది. చిలీలో కేంద్రంగా సంభవించిన ఈ భూకంప తీవ్ర రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. తైవాన్ రాజధాని శాంటియాగోకు ఉత్తర దిక్కున అర్జెంటీనా– బొలీవియా సరిహద్దుల్లో చిలీలోని సాన్ పెడ్రో డే, అటకామాకు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూ ఉపరితలం నుంచి 12 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో సంభవించిన పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. భూకంప కేంద్రానికి 265 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతిపెద్ద తీర ప్రాంత నగరం ఆంటోఫొగస్టాలో కూడా ప్రభావం పడింది. ప్రకంపనల ధాటికి భవనాలు బీటలు వారాయి. అంటే భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చైసుకోవచ్చు.
సునామీ హెచ్చరిక జారీ..
భూకంపం సంభవించిన వెంటనే అమెరికా జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. సముద్ర తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించింది. పరిస్థితి సద్దుమణిగే వరకు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అటకామాకు ఈశాన్య దిశలో 41 కిలోమీటర్ల దూరంలో చిలీ దేశ కాలమానం ప్రకారం గురువారం రాత్రి 9:51 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీని తీవ్రతకు తీర ప్రాంతం అల్లకల్లోలమైంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు.
రింగ్ ఆఫ్ ఫైర్..
పసిఫిక్ మహాసముద్రంలో తరచుగా భారీ భూకంపాలు సంభవిస్తుంటాయి. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫూర్ అంటారు. అలాంటి రింగ్ ఆఫ్ ఫైర్ భూభాగంలో ఉన్న చిలీని తరచూ భూకంపాలు వణికిస్తుంటాయి. భూకంపాలు రావడం వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేయడం ఇక్కడ సర్వసాధారణంగా జరుగుతుంటాయి. అక్కడ కట్టడాలు కూడా భూకంపాలు, సునామీలను తట్టుకునేలా ఉంటాయి.
చాలా ఏళ్ల తర్వాత ఎక్కువ తీవ్రత..
చిలీలో భూకంపాలు సాధారణమే గానీ ఈ స్థాయి తీవ్రతతో రావడం కొన్ని సంవత్సరాల తరువాత ఇదే తొలిసారి. భూమి తరచూ ప్రకంపించే రింగ్ ఆఫ్ దేశాల జాబితాలో ఉంది చిలీ. బొలీవియా, చిలీ, ఈక్వెడార్, పెరూ, కోస్టారికా, గ్వాటెమాల, మెక్సికో, అమెరికా, కెనడా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేషియా, న్యూజిలాండ్, అంటార్కిటికా దేశాలు రింగ్ ఆఫ్ ఫైర్ లిస్టులో ఉన్నాయి.