https://oktelugu.com/

Hardik Pandya :పాపం హార్దిక్ పాండ్యా.. ఇంతటి కష్టం ఎవరికీ రావొద్దు

స్వదేశంలో గత ఏడాది చివరిలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఈ మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.. అర్ధాంతరంగా జట్టును వీడాడు. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైంది. ఐపీఎల్ లో ముంబై జట్టు హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంది . అప్పటిదాకా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను ఒక ఆటగాడిగా పరిమితం చేసింది

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : July 19, 2024 / 01:35 PM IST
    Follow us on

    Hardik Pandya : టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు ప్రస్తుతం కష్టకాలం నడుస్తోంది. మెరుగు ఆడుతున్నప్పటికీ అతడికి టి20 కెప్టెన్సీ దక్కలేదు. మరోవైపు వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఆటుపోట్లు చోటుచేసుకుంటున్నాయి. నాలుగేళ్లు కలిసి జీవించిన భార్యతో విడాకులు తీసుకున్నాడు.. అంతకుముందు ఐపీఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు విపరీతమైన ట్రోల్ కు గురయ్యాడు. టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా పై సదాభిప్రాయం ఏర్పడింది. కానీ భార్య నటాషా తో విడాకులు తీసుకున్నానని ప్రకటించిన తర్వాత మరోసారి బ్యాడ్ లక్ హార్దిక్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

    వన్డే వరల్డ్ కప్ నుంచి

    స్వదేశంలో గత ఏడాది చివరిలో వన్డే వరల్డ్ కప్ జరిగింది. ఈ మెగా టోర్నీలో హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు.. అర్ధాంతరంగా జట్టును వీడాడు. ఆ టోర్నీ ఫైనల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఆ తర్వాత ఐపీఎల్ మొదలైంది. ఐపీఎల్ లో ముంబై జట్టు హార్దిక్ పాండ్యాను రిటైన్ చేసుకుంది . అప్పటిదాకా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను ఒక ఆటగాడిగా పరిమితం చేసింది. దీంతో రోహిత్ అభిమానులు హార్దిక్ పాండ్యాను గేలి చేయడం మొదలుపెట్టారు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా తో దూరంగా ఉంటున్నాడని వార్తలు వినిపించాయి. నటాషా కూడా హార్దిక్ పాండ్యా పాడిన మ్యాచ్ లకు హాజరు కాలేదు.. దీనికి తోడు ఐపిఎల్ లో ముంబై జట్టు దారుణమైన ప్రదర్శన కనబరిచింది. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫలితంగా హార్దిక్ లండన్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచే టి20 వరల్డ్ కప్ లో టీమిండియాతో జాయిన్ అయ్యాడు. టి20 వరల్డ్ కప్ లో హార్దిక్ పాండ్యా తనదైన ఆట తీరు ప్రదర్శించాడు. జట్టుకు అవసరమైన ప్రతిసారి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంతితో వికెట్లు కూడా తీశాడు. ముఖ్యంగా టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా పై చివరి ఓవర్లో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి, రెండు వికెట్లు పడగొట్టాడు. టి20 వరల్డ్ కప్ టోర్నీ హీరోగా ఆవిర్భవించాడు. అయినప్పటికీ నటాషా అతడిని అభినందించలేదు. చివరికి టి20 వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ కూడా హార్దిక్ తన కొడుకుతోనే జరుపుకున్నాడు.

    నటాషా కూడా తాము విడిపోయామని సంకేతాలు ఇచ్చింది.. జిమ్ లో దిశా పటాని మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫోటోలు దిగింది. అతడికి అత్యంత చనువుగా కనిపించింది.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు భావుకత తో కూడిన పోస్టులు చేసింది. చివరికి కుమారుడు అగస్త్యను తీసుకొని సెర్బియా వెళ్ళిపోయింది. నటాషా సెర్బియా వెళ్లిన మరుసటి రోజు హార్దిక్ పాండ్యా తామిద్దరం విడాకులు తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇద్దరి దారులు వేరయ్యాయని వెల్లడించాడు. అయితే అంతకుముందు హార్దిక్ పాండ్యా ప్రాచీ సోలంకి అనే యువతితో సన్నిహితంగా ఫోటోలు దిగాడు. అయితే ఆమె ఆ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీంతో హార్దిక్ ఆమెతో ప్రేమలో ఉన్నాడని సభ్య సమాజానికి తెలిసింది. అయితే దానిపై అటు ప్రాచీ ఇటు హార్దిక్ నోరు మెదపలేదు.

    ఇదంతా జరుగుతుండగానే హార్దిక్ పాండ్యాకు టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ సరి కొత్త స్ట్రోక్ ఇచ్చాడు.. టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటినప్పటికీ హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వలేదు. శ్రీలంకతో జరిగే టి20 టోర్నీలో అతడిని ఒక ఆటగాడిగా మాత్రమే ఎంపిక చేశాడు. హార్దిక్ విన్నపం మేరకు వన్డే టోర్నికి అతనిని దూరంగా ఉంచారు. ఇలా వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యా పై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. నెటిజన్లు హార్దిక్ పాండ్యా మీద జాలి చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ ఆటగాడికి కూడా రావద్దని కామెంట్స్ చేస్తున్నారు.