https://oktelugu.com/

Guntur Kaaram Review: గుంటూరు కారం ఫుల్ మూవీ రివ్యూ…

త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిందా లేదా అనే విషయాన్ని మనం డీప్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం...

Written By: , Updated On : January 12, 2024 / 09:47 AM IST
Guntur Kaaram Review

Guntur Kaaram Review

Follow us on

Guntur Kaaram Review: త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడం సహజం. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకుముందు అతడు, ఖలేజా లాంటి రెండు సినిమాల వచ్చాయి. అయితే ఈ సినిమాలు థియేటర్లో ప్రేక్షకులను ఆకట్టుకోనప్పటికీ ఈ సినిమాలు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని మాత్రం సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్, మహేష్ బాబు ఇద్దరు కలిసి గుంటూరు కారం అనే సినిమా చేశారు… ఈ సినిమా కోసం అభిమానులు చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు దాదాపు రెండు సంవత్సరాల కిందటనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది ఇప్పటికీ ఎప్పుడో ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల డిలే అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మెప్పు పొందిందా లేదా అనే విషయాన్ని మనం డీప్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…

కథ…

ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే వసుంధర (రమ్యకృష్ణ) అనే ఆవిడ సత్యం (అభిరామ్) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన కొన్ని గొడవల వల్ల ఇద్దరూ విడిపోతారు. అప్పటికే వీళ్లకు రమణ అనే కొడుకు ఉంటాడు. అయితే వసుంధర మాత్రం తన కొడుకు ను భర్త దగ్గరే వదిలేసి తను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చేసి అక్కడ ఇంకో పెళ్లి చేసుకుంటుంది. అలాగే రాజకీయంగా కూడా బాగా ఎదుగుతుంది. మినిస్టర్ గా కూడా పదవిని పొందుతుంది. ఇక తను రాజకీయంగా ఎదిగిన తర్వాత తన మొదటి భర్త నుంచి గాని తన కొడుకు నుంచి గాని ఏదైనా ఇబ్బంది ఎదురవచ్చు అని వసుంధర తండ్రి అయిన వెంకటస్వామి ( ప్రకాష్ రాజ్) వసుంధర కొడుకు అయిన రమణ ని పిలిపించి కి తనకి తన తల్లికి ఎలాంటి సంబంధం లేదని పేపర్ మీద ఒక సంతకం చేయించాలని అనుకుంటాడు. అందులో భాగంగానే రమణని హైదరాబాద్ కి పిలిపిస్తాడు మరి ఇలాంటి సిచువేషన్ లో రమణ తన తల్లికి తనకి సంబంధం లేదని సంతకం చేశాడా..? లేదా అనే విషయాలు తెలియాలి అంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..?

విశ్లేషణ…

ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ స్టోరీ ని మనం చాలా సార్లు చూసిన సినిమాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఇంతకుముందు త్రివిక్రమ్ చేసిన అలా వైకుంఠపురం లో సినిమా కూడా ఇవే ఛాయలు కనిపిస్తాయి. అలాగే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో చేసిన అత్తారింటికి దారేది సినిమా కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది.అయినప్పటికీ తెలిసిన కథని డీల్ చేయడంలో త్రివిక్రమ్ ఒక మాస్టర్ మైండ్ అనే చెప్పాలి. కథ, కథనాన్ని ఎలా నడిపిస్తే ప్రేక్షకుడికి నచ్చుతుంది అనేది త్రివిక్రమ్ కి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదు. కాబట్టి పాత స్టోరీ ని మసిపూసి మేనేజ్ చేయాలని చూశాడు అయినప్పటికీ ఈ కథలో దమ్ము లేకపోవడంతో సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి ఏదో అసంతృప్తి అయితే కలుగుతుంది… త్రివిక్రమ్ డిజైన్ చేసిన క్యారెక్టర్లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. క్యారెక్టర్జేషన్స్ ని డిజైన్ చేయడంలో త్రివిక్రమ్ మొదటి స్థానంలో ఉంటాడు. అయినప్పటికీ ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం ఖలేజా సినిమాలో మహేష్ బాబును గుర్తుచేస్తుంది. అలాగే ఈ సినిమా లో ఒక్క క్యారెక్టర్ కి కూడా సరైన ఎస్టాబ్లిష్మెంట్ ఇవ్వలేదనే చెప్పాలి. ఒక్కో క్యారెక్టర్ కి సంబంధించిన బ్యాక్ స్టోరీ ని గానీ ఆ పాత్ర ల్లో ఉన్న డెప్త్ ని డీటెయిల్ గా నరేట్ చేయడంలో త్రివిక్రమ్ చాలావరకు ఫెయిల్ అయ్యాడు.

ఇక హీరో తనంతట తాను బతుకుతుంటే సంతకం కోసం అతన్ని గుంటూరు నుంచి హైదరాబాద్ కు పిలిపించి కావాలనే తనని కథలోకి ఇన్వాల్వ్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇలా చాలా కృత్రిమమైన సీన్స్ ని రాసుకోవడంతో ఈ సినిమా ఎమోషనల్ గా ప్రేక్షకుడికి కనెక్ట్ అవ్వడం చాలా కష్టం గా అనిపిస్తుంది. ఇక హీరోయిన్ శ్రీలీలా గురించి తీసుకుంటే తను డాన్సులు మాత్రమే బాగా వేసింది. ఆమె క్యారెక్టర్ కూడా సినిమాలో పెద్దగా ఏమీ ఉండదు సాంగ్స్ వచ్చినప్పుడు కనిపిస్తుంది సాంగ్స్ అయిపోయాక వెళ్ళిపోతుంది. ఇక వెన్నెల కిషోర్ మహేష్ బాబు మధ్య వచ్చే కామెడీ సీన్లు ప్రేక్షకుల్ని కొంతవరకు ఆనందపరిచినప్పటికీ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలో లాగా కామెడీ సీన్స్ ఈ సినిమాలో బ్లాస్ట్ అయితే అవ్వవు జస్ట్ యావరేజ్ కామెడీ సీన్లు మాత్రమే పడ్డాయి. అది కూడా కథతో సంబంధంలేని ఒక సపరేట్ ట్రాక్ గా కామెడీ సీన్లను వాడుకున్నారు తప్ప కథలో ఇన్వాల్వ్ అయ్యే కామెడీని పుట్టించడంలో త్రివిక్రమ్ చాలా వరకు ఫెయిల్ అయ్యాడు. ఈ సినిమాలో ఒక ఎమోషనల్ సీన్ లో మహేష్ బాబు రమ్యకృష్ణ మాట్లాడుకుంటుంటే చూసే జనాలకి అది చాలా సిల్లీగా కామెడీగా అనిపించింది తప్ప ఒక తల్లి కొడుకు మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ లాఎవరికి అనిపించలేదు. అందువల్ల ఈ సినిమా చాలావరకు ప్రేక్షకుడి మెప్పించ లేకపోయింది. ఇక జగపతిబాబు క్యారెక్టర్ కి ఉన్న కథాంశం ఏమిటో మనకు అర్థం కాదు ఆయన్ని అసలు సినిమాలో ఎందుకు తీసుకున్నారో కూడా క్లారిటీ లేదు. త్రివిక్రమ్ ఖలేజా సినిమాలో ‘అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించరు జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు’ లాంటి అదిరిపోయే డైలాగులను రాసిన త్రివిక్రమ్ ఈసారి తన పెన్ను కి ఎక్కువగా పని పెట్టినట్టుగా కనిపిస్తుంది. ఈ సినిమాలో అన్నీ డైలాగ్ లు కూడా ఏదో లైట్ వెయిట్ గా అనిపించేవే తప్ప హృదయాన్ని హత్తుకునేలా ఒక్క డైలాగు కూడా లేదు. ఎమోషనల్ డైలాగుల విషయాన్ని పక్కన పెడితే మహేష్ బాబు చెప్పే పంచ్ డైలాగుల్లో కూడా పెద్దగా పవర్ అయితే కనిపించలేదు. ఇక నటుడు సునీల్ కూడా ఈ సినిమాలో చిన్న పాత్ర కోసం తీసుకున్నారు ఆయన్ని ఎందుకు తీసుకున్నారు కూడా క్లారిటీ లేదు.

ఇక ఈ సినిమాలో చాలా పాత్రలకి ప్రాపర్ జస్టిఫికేషన్ లేకపోవడం అలాగే ఆ క్యారెక్టర్ ని నిర్దేశించిన విధానం సరిగ్గా ఉండకపోవడం ఆ పాత్రల యొక్క గోల్ ఏంటో సినిమాలో చూపించకపోవడం ఆ క్యారెక్టర్ల ని సినిమాకి ఎలా కనెక్ట్ చేయాలో అర్థం కాకపోవడం ఇవన్నీ త్రివిక్రమ్ మైనస్ లు అనే చెప్పాలి. అంటే క్యారెక్టర్ కి క్యారెక్టర్ కి మధ్య ఇంటర్ లింక్ ఏర్పరచడం లో క్యారెక్టర్ కి ఫైనల్ డెస్టినేషన్ ని ఏర్పాటు చేయడంలో తను టోటల్ గా ఫెయిల్ అయిపోయాడు అనడం లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి త్రివిక్రమ్ ఎందుకు ఇలాంటి ఒక ఆర్టిఫిషియల్ క్యారెక్టర్ల ని సృష్టించి ఇదే ప్రపంచం అని ప్రేక్షకుడిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. కానీ ప్రేక్షకుడు అంత తెలివితక్కువ వాడైతే కాదు. ఇక త్రివిక్రమ్ కూడా తన స్టైల్ ని మార్చుకుంటే మంచిది ఎందుకంటే ఎప్పుడు అవే సినిమాలు అదే రొటీన్ ఫార్ములాతో వెళ్తుంటే సినిమా చూసే ఆడియన్ కి కూడా ఆయన సినిమాలు చూడాలి అంటే చాలా ఇబ్బంది అయితే కలుగుతుంది…

నటీనటుల పర్ఫామెన్స్…

ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే మహేష్ బాబు ఎప్పటి లాగే తన నట విశ్వరూపాన్ని చూపించాడు. హై ఎనర్జిటిక్ గా మాట్లాడుతూ, డైలాగులు పేలుస్తూ సప్పగా ఉన్న స్టోరీలో ఎనర్జీని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు. ఒకరకంగా మహేష్ వన్ మాన్ షో చేసినప్పటికీ స్టోరీ లో మ్యాటర్ లేకపోవడం వల్ల ఆయన ఎంత ప్రయత్నం చేసిన సినిమాని హైప్ చేయలేకపోయాడు. అలాగే తన క్యారెక్టర్ కి లిమిటేషన్స్ ని దాటకుండా తనిచ్చిన పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక శ్రీలీలా పాత్ర పాటలకు మాత్రమే పరిమితమైంది. సినిమాలో ఆమె నటనకి పెద్దగా స్కోప్ అయితే లేదు. రమ్యకృష్ణ పాత్రకి పర్ఫామెన్స్ పరంగా స్కోప్ ఉన్నప్పటికీ అనే ఇచ్చిన పర్ఫామెన్స్ కూడా సినిమాకి కొంతవరకు ప్లస్ అయింది. ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరామ్, మురళి శర్మ వంటి వారి పాత్రలు ఉన్నప్పటికీ వాళ్లు కూడా వాళ్ల పాత్రల మేరకు ఎంతో కొంత ప్రయత్నం అయితే చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడ పేలింది. సునీల్ క్యారెక్టర్ చిన్నదే అయినప్పటికీ పెద్దగా మనకు రిజిస్టర్ అయితే అవ్వదు…

టెక్నికల్ అంశాలు…

ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి తమన్ అందించిన మ్యూజిక్ ఓకే గా అనిపించింది. కుర్చీ మడతపెట్టి సాంగ్ అయితే సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది అనే చెప్పాలి. థియేటర్ లో ఈ సాంగ్ వచ్చినప్పుడు జనాలు కుర్చీలో నుంచి లేచి మరి డ్యాన్సులు వేస్తున్నారు అంటే ఈ పాట ప్రేక్షకుల్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. తమన్ బిజిఎం సూపర్ గా ఇస్తాడు అంటూ తనకి టాక్ అయితే ఉంది అయినప్పటికీ ఈ సినిమాలో తను ఇచ్చిన బిజిఎం పెద్దగా రిజిస్టర్ అయితే అవ్వలేదు అలాగే ఆ సీన్ లో ఉన్న డెప్త్ ని ఎలివేట్ చేయడంలో కూడా చాలా వరకు తేలిపోయింది…ఇక మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకి చాలావరకు సెట్ అయింది. త్రివిక్రమ్ అనుకున్న ఆ మూడు ని క్రియేట్ చేయడంలో మనోజ్ పరమహంస చాలా వరకు సక్సెస్ అయ్యాడు. అలాగే ఎడిటర్ నవీన్ నూలి ఒక సీన్ ని ఎంత లెంత్ లో కట్ చేయాలో కరెక్ట్ గా ప్రాపర్ గా కొలత వేసినట్టుగా కట్ చేశాడు… ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకి మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి…

ప్లస్ పాయింట్స్

ఇక ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే
మహేష్ బాబు,రమ్య కృష్ణ
కుర్చీ మడత పెట్టే సాంగ్
ప్రొడక్షన్ వాల్యూస్…

మైనస్ పాయింట్స్

ఇక ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటంటే
కథ, కథనం
బిజిఎం
గమ్యం లేని కొన్ని పాత్రలు

రేటింగ్

ఇక ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 2.5/5

చివరి లైన్ : ఏమాత్రం కారం లేకుండా చప్పగా సాగిన గుంటూరు కారం…