Trivikram Srinivas: త్రివిక్రమ్ రేంజ్ ఇంతేనా..? రాజమౌళి, సందీప్ వంగ లా స్థాయికి వెళ్లలేడా..?

త్రివిక్రమ్ రొటీన్ గా మార్చేసి ప్రతిసారి అదే ఫార్మాట్ లో సినిమాలు చేస్తున్నాడు అంటూ త్రివిక్రమ్ మీద చాలా వరకు నెగిటివ్ టాకైతే వస్తుంది. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలో హిట్ అయితే అవుతాయి కానీ ప్రేక్షకుడి మనసు గెలుచుకోవడంలో చివరి స్థానాన్ని సంపాదించుకుంటాయి.

Written By: Gopi, Updated On : January 12, 2024 9:12 am

Trivikram Srinivas

Follow us on

Trivikram Srinivas: త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వచ్చిన గుంటూరు కారం సినిమా ఈరోజు రిలీజ్ అయి సక్సెస్ టాక్ ను అయితే సంపాదించుకుంది. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ గత సినిమాల మాదిరిగానే ఇద్దరు హీరోయిన్లు, ఒక ఫ్యామిలీ, ఒక విలన్ లతో సినిమాని లాగించినట్టు గా తెలుస్తుంది.

అయితే ఇలాంటి ఫార్ములాని త్రివిక్రమ్ రొటీన్ గా మార్చేసి ప్రతిసారి అదే ఫార్మాట్ లో సినిమాలు చేస్తున్నాడు అంటూ త్రివిక్రమ్ మీద చాలా వరకు నెగిటివ్ టాకైతే వస్తుంది. ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీలో హిట్ అయితే అవుతాయి కానీ ప్రేక్షకుడి మనసు గెలుచుకోవడంలో చివరి స్థానాన్ని సంపాదించుకుంటాయి. ఇక ఇలాంటి సినిమాలు కాకుండా త్రివిక్రమ్ మంచి ప్రయోగాత్మకమైన సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించవచ్చు కానీ త్రివిక్రమ్ మాత్రం అల చేయడు. ఎందుకంటే రొటీన్ ఫార్ములా తనకి తెలిసిన జోనర్ లోనే పెద్దగా కష్టం లేకుండా సినిమాలు చేస్తూ సక్సెస్ సాధించాలని చూస్తుంటాడు.

ఇక కథ కూడా తనది కాకుండా వేరే వాళ్ళది కాపీ చేసి తన టైప్ ఆఫ్ కామెడీ ని జోడించి అలాగే మంచి మాటలను రాసి ఆ సినిమాని సక్సెస్ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేసి మరోసారి సక్సెస్ అయ్యాడు. ఇది గుంటూరు కారం సినిమా ఇంతకుముందు త్రివిక్రమ్ తీసిన అలా వైకుంఠపురం సినిమాలో ఎలాగైతే చివర లో మదర్ సెంటిమెంట్ ఉంటుందో ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో మదర్ కు సంబంధించిన సెంటిమెంట్ తోనే ఈ సినిమాని ఎండ్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ కి సక్సెస్ కంటే కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలి.

రాజమౌళి, సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకులు డిఫరెంట్ సినిమాలను చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తుంటే త్రివిక్రమ్ మాత్రం అవే రొట్ట కొట్టుడు సినిమాలను చేస్తూ తెలుగు సినిమా స్థాయిని అదే రొటీన్ రేంజ్ లో ఉంచుతున్నాడు.ఇక ఇప్పటికైనా త్రివిక్రమ్ మారి ఇప్పుడు ఉన్న యంగ్ జనరేషన్ డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు అయితే చేస్తున్నారో అలాంటి సినిమాలు చేస్తే మంచిదని చాలామంది వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…