Guntur Kaaram Public Talk: సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం తో సంక్రాంతి బరిలో నిలిచిన విషయం తెలిసిందే. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో మహేష్ బాబుకు ఇది మూడో చిత్రం. గతంలో వీరి కాంబోలో అతడు, ఖలేజా చిత్రాలు విడుదలయ్యాయి. దీంతో హ్యాట్రిక్ మూవీపై అంచనాలు ఏర్పడ్డాయి. గుంటూరు కారం జనవరి 12న వరల్డ్ వైడ్ విడుదల చేశారు. యూఎస్ లో అర్థరాత్రి నుండే ప్రీమియర్స్ ప్రదర్శన జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా స్పెషల్ షోలు వేశారు.
గుంటూరు కారం సినిమా చూసిన జనాలు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. గుంటూరు కారం చిత్రానికి మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. సినిమాలు ప్లస్ పాయింట్స్ గా మహేష్ బాబు యాక్టింగ్, క్యారెక్టరైజేషన్ చెప్పుకొస్తున్నారు. ఫస్ట్ హాఫ్ బాగుందంటున్న ఆడియన్స్ మహేష్ డైలాగ్స్, కామెడీ టైమింగ్, యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయని అభిప్రాయపడుతున్నారు.
గుంటూరు కారం మహేష్ బాబు వన్ మ్యాన్ షో. శ్రీలీలతో కుర్చీ మడతపెట్టి సాంగ్ అదిరిపోయింది. ప్రేక్షకులు కుర్చీలలో కూర్చోలేరు అంటున్నారు. మహేష్ బాబు-శ్రీలీల ఎనర్జిటిక్ మాస్ స్టెప్స్ మెప్పిస్తాయిని అంటున్నారు. కాగా త్రివిక్రమ్ డైరెక్షన్ అంతగా ఆకట్టుకోలేదు. కథలో బలం లేదు. ఫ్లాట్ నెరేషన్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు విసిగించాయని అంటున్నారు. సెకండ్ హాఫ్ బాగా తీయాల్సింది అంటున్నారు.
మొత్తంగా చెప్పాలంటే గుంటూరు కారం ఫ్యాన్స్ తో పాటు మాస్ ఆడియన్స్ ని అలరిస్తుంది. ఫ్యాన్స్ కి కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు సినిమాలో ఉన్నాయి. ఇది గుంటూరు కారం పై పబ్లిక్ రియాక్షన్. గుంటూరు కారం చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సునీల్ కీలక రోల్స్ చేశారు.